Gold Prices Today : గుడ్ న్యూస్...బంగారం లక్షకు దిగి వస్తుందా? నిపుణులు ఏమంటున్నారంటే?

ఈరోజు దేశంలో బంగారం ధర తగ్గింది. వెండి ధరలు కూడా తగ్గాయి.

Update: 2026-03-23 03:09 GMT

బంగారం ధరలు మరింతగా తగ్గుతున్నాయి. బంగారం, వెండి ధరలు పతనం దిశగా పరుగులు పెడుతున్నాయి. గత వారంలోనే పెరిగిన ధరల్లో దాదాపు పదకొండు శాతం మేరకు తగ్గాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా బంగారం, వెండి ధరలు పెరగకపోవడానికి అనేక కారణాలున్నాయంటున్నారు. ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధం ప్రారంభమయిన తర్వాత ధరల విషయంలో అనిశ్చితి కొనసాగుతుందని భావించి తాము పెట్టుబడిన పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నారు. దీంతో ధరలు తగ్గుతున్నాయన్న వాదన ఒకవైపు నుంచి వినిపిస్తుంది.

యుద్ధం కొనసాగుతున్నా...
ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధం మొదలై దాదాపు నాలుగు వారాలు కొనసాగుతుంటే.. దాదాపు పది రోజుల నుంచి వరసగా బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. అంతర్జాతీయంగా ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాద్యం, డాలర్ మరింత బలపడటం, క్రూడాయిల్ ధరలు పెరగడంతో డాలర్ మరింత బలపడటం కారణంగానే ధరలు తగ్గుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. రానున్న కాలంలో ఈ ప్రభావంతో బంగారం పది గ్రాములు లక్ష రూపాయలకు దిగువకు చేరినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.
మూఢమి నడుస్తుండటంతో...
ప్రస్తుతం మూఢమి నడుస్తుంది. బంగారం, వెండి కొనుగోళ్లు అంతగా ఉండవు.అయితే మళ్లీ జూన్ నుంచి శుభముహూర్తాలు ఉండటంతో ధరలు పతనమయితే ముందుగానే బంగారం, వెండి కొనుగోలు చేసేవారు ఎక్కువగా ఉన్నారని వ్యాపారులు చెబుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధర తగ్గింది. వెండి ధరలు కూడా తగ్గాయి. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,33,790 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం ధర 1,45,960 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 2,49,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులుండవచ్చు.


Tags:    

Similar News