Road Accident : హైదరాబాద్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం

హైదరాబాద్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Update: 2026-01-02 05:03 GMT

హైదరాబాద్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముసారాంబాగ్‌ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భార్యాభర్తలు మరణించారు. స్కూటీపై వెళుతున్న భార్యా భర్తలను ఆర్టీసీ బస్సు ఢీకొట్టిటంది. దీంతో ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో దంపతులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతులు తిరుమలరావు, వెంకటరమణగా గుర్తించారు.

ఇద్దరు మృతి...
బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆర్టీసీ బస్సు అతివేగంతో వస్తున్నందునే ఈ ప్రమాదం సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆర్టీసీ బస్సులు అతి వేగంతో వెళుతున్నాయని పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఆర్టీసీ యాజమాన్యం పట్టించుకోవడం లేదన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.


Tags:    

Similar News