Hyderabad : గుడ్ న్యూస్...న్యూ ఇయర్ వేళ ఉచిత రైడ్ సేవలు
హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్
హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్. న్యూ ఇయర్ వేడుకల సమయంలో రోడ్డు భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం సేవించిన వారు సురక్షితంగా ఇంటికి చేరేందుకు ఉచిత రవాణా సేవలు అందించనున్నట్లు యూనియన్ ప్రకటించింది. డిసెంబర్ 31 రాత్రి 11 గంటల నుంచి జనవరి 1 తెల్లవారుజామున 1 గంట వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగంగా క్యాబ్‌లు, ఆటోలు, ఎలక్ట్రిక్ బైక్‌లు కలిపి సుమారు 500 వాహనాలు సిద్ధం చేసినట్లు పేర్కొంది.
మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో...
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధుల్లో ఉచిత రైడ్ సదుపాయం అందుబాటులో ఉంటుందని యూనియన్ తెలిపింది. ఈ సేవలు పొందాలనుకునే వారు 8977009804 నంబర్‌కు కాల్ చేయాలని సూచించింది.మద్యం మత్తులో వాహనాలు నడిపే ఘటనలు జరగకుండా అడ్డుకోవడం, న్యూ ఇయర్ వేడుకల సమయంలో ప్రయాణికుల భద్రతను కాపాడడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని యూనియన్ వివరించింది. మద్యం తాగిన వారు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు.