Telangana : ప్రజాభవన్ లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్

తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల అంశాలపై ప్రజాభవన్ లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ప్రారంభమయింది

Update: 2026-01-01 12:37 GMT

తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల అంశాలపై ప్రజాభవన్ లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ప్రారంభమయింది. రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరుగుతుంది. తొలుత పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పధకంపై కేసీఆర్ చేసిన విమర్శలకు ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరిస్తున్నారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తమ హయాంలో 90 శాతం పూర్తి చేశామని బీఆర్ఎస్ అబద్ధాలు చెబుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

ఎత్తిపోతల పథకంపై...
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఏడు వేల కోట్ల రూపాయలు కేటాయించి పనులు చేపట్టినా తట్టెడు మట్టి ఎత్తిపోయలేదని తప్పుడు విమర్శలు చేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ ప్రెజెంటేషన్ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు అలాగే రాష్ట్ర మంత్రి వర్గం, లోక్ సభ, రాజ్య సభ శాసనసభ, శాసన మండలి సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొనన్నారు.


Tags:    

Similar News