Hyderabad : హైదరాబాద్ లో బిర్యానీ తిని ఒకరు మృతి
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. బిర్యాని తిని ఒకరు మరణించారు. ఈ ఘటన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నూతన సంవత్సర వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. ఒకరు మృతి చెందారు. మరో 11 మంది చికిత్స పొందుతున్నారు. మేడ్చల్ జిల్లా జగద్గురిగుట్ట పి.యస్ భవానినగర్ అసోసియేషన్ లో రాత్రి నూతన సంవత్సర వేడుకల్లో 17 మంది కలిసి జరుపుకున్నారు.
పార్టీ చేసుకుని...
మద్యం సేవించి, సభ్యులు స్వయంగా అక్కడే తయారుచేసుకొన్న చికెన్ బిర్యాని, ఫిష్ కర్రి,రోటి తిని 17 మంది అస్వస్థత కి గురయ్యారు. వీరిలో పాండు అనే వ్యక్తి మృతి చెందగా అపస్మారక స్థితిలో ఉన్న 9 తొమ్మిది మంది ని చికిత్స్ నిమిత్తం నారాయణ మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించార. మరో ఇద్దరు రామ్ దేవ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకొన్న జగద్గురి గుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చేసుకొని వండిన పదార్థాలను సీజ్ చేసి అధికారులు పరీక్షల కోసం ల్యాబ్ కు పంపించారు.