యూట్యూబర్ అన్వేష్ పై పోలీసు కేసు
యూట్యూబర్ అన్వేష్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది.
యూట్యూబర్ అన్వేష్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. ఇటీవల అన్వేష్ చేసిన వ్యాఖ్యలు ఈ కేసు నమోదుకు కారణమయ్యాయి. అన్వేష్ హీరోయిన్ దుస్తులపై శివాజీ వ్యాఖ్యలతో పాటు మహిళల దుస్తులపై ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై అన్వేష్ ఒక వీడియో చేశాడు. వారిద్దరినీ తప్పు పడుతూ స్త్రీలకు స్వేచ్ఛ కావాలని అన్వేష్ ఆ వీడియోలో తెలిపాడు.
హిందూదేవతలను...
అయితే అదే సమయంలో హిందూ దేవతలను కించపర్చే విధంగా మాట్లాడటంతో యూట్యూబర్ అన్వేష్ పై సినీ నటి కరాటే కల్యాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. హిందూ దేవతలను అవమానపర్చే విధంగా మాట్లాడిన అన్వేష్ పై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన తర్వాత అన్వేష్ సోషల్ మీడియా ఖాతా నుంచి లక్షల సంఖ్యలో ఫాలోయిర్లు తప్పుకుంటున్నారు. యూట్యూబర్ అన్వేష్ పై హిందూ సంఘాలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆ తర్వాత మరో వీడియోలో తాను చేసిన వ్యాఖ్యలకు అన్వేష్ క్షమాపణలు కూడా చెప్పాడు.