న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ పోలీసుల ఆంక్షలివే

న్యూ ఇయర్ వేడుకలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి అని పోలీసులు తెలిపారు

Update: 2025-12-20 12:03 GMT

న్యూ ఇయర్ వేడుకలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి అని పోలీసులు తెలిపారు. అనుమతి లేకుండా పార్టీలు నిర్వహిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పార్టీల్లో డ్రగ్స్ వినియోగం లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈవెంట్లకు సామర్థ్యానికి మించి టిక్కెట్లను విక్రయించకూడదని పోలీసులు చెబుతున్నారు. అనుమతులు లేకుండా ఎటువంటి లిక్కర్ పార్టీలు చేసినా కూడా అదిచట్ట విరుద్ధమేనని అన్నారు. పార్టీలకు పబ్ లకు మైనర్లను అనుమతించ వద్దని పోలీసులు తెలిపారు.

రాత్రి ఒంటి గంట వరకూ మాత్రమే...
న్యూ ఇయర్ వేడుకలకు రాత్రి ఒంటి గంట వరకూ మాత్రమే అనుమతి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. మద్యం సేవించి రోడ్లపైకి వస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. డ్రగ్స్ పై లా అండ్ ఆర్డర్ పోలీసుల తో పాటు ఈగల్ టీం నిఘా కూడా ఉంటుందని పోలీసులు తెలిపారు. పార్కింగ్ ఏరియా కూడా స్పష్టంగా నిర్దేశించాలని పోలీసులు తెలిపారు. ఆంక్షలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈవెంట్లకు సామర్థ్యానికి మించిన టిక్కెట్లను విక్రయించడమూ నేరమవుతుందని చెుతున్నారు.


Tags:    

Similar News