రాజేంద్రనగర్ పీవీ ఎక్స్ ప్రెస్ హైవేపై ప్రమాదం

రాజేంద్రనగర్ పీవీ ఎక్స్ ప్రెస్ హైవేపై ప్రమాదం జరిగింది

Update: 2025-12-20 06:20 GMT

రాజేంద్రనగర్ పీవీ ఎక్స్ ప్రెస్ హైవేపై ప్రమాదం జరిగింది. దీంతో రాజేంద్ర నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఉప్పర్ పల్లి నుంచి ఆరంఘర్ చౌరస్తా వరకూ భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వరసగా మూడు కార్లు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. పిల్లర్ నెంబరు 253 దగ్గర మూడు కార్లు ఒకదానిని ఒకటి ఢీకొట్టాయి. దీంతో కార్లు అక్కడే నిలిచిపోయాయి.

భారీగా ట్రాఫిక్ జామ్...
దాదాపు ఆరు కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో ఉన్నారు. మితిమీరిన వేగంతో వెళ్లడం వల్లనే ఒకదానిని ఒకటి ఢీకొనట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ మరణించలేదని ఇప్పటి వరకూ అందిన సమాచారం.పోలీసులు అక్కడకు చేరుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు.


Tags:    

Similar News