Congress : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో నిరసనలు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో నిరసనలు తెలిపింది.

Update: 2025-12-20 08:05 GMT

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో నిరసనలు తెలిపింది. జాతీయ ఉపాధిహామీ పథం పేరును మార్చడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసనలు తెలియజేశారు. మోదీ రాక్షస పాలన అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్యారడైజ్ ఎంజీ రోడ్డులో నిరసనకు దిగారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

గాంధీ పేరు తొలగించడంపై...
గాంధీ అంటే ఒక నమ్మకం అని, గాంధీ అంటే పేరు కాదు అని గుండె చప్పుడు అని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఉపాధి హామీలో గాంధీ పేరు తొలగించడంపై ఎన్ని అభ్యంతరాలు చెప్పినా పట్టించుకోలేదన్నారు. ఆందోళనలను గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్లి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దయెత్తున నిరసనలు తెలియజేయాలని కోరారు.


Tags:    

Similar News