Hyderabad : హైదరాబాద్ మెట్రో రైలును వదిలించుకునేందుకు సిద్ధమైన ఎల్ అండ్ టి
హైదరాబాద్ లో మెట్రో రైలు ప్రాజెక్టు నుంచి తన వాటాను విక్రయించేందుకు ఎల్ అండ్ టి సంస్థ సిద్ధమని ప్రకటించడం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమైంది.
హైదరాబాద్ లో మెట్రో రైలు ప్రాజెక్టు నుంచి తన వాటాను విక్రయించేందుకు ఎల్ అండ్ టి సంస్థ సిద్ధమని ప్రకటించడం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమైంది. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో తన వాటాను 90 శాతం కంటే ఎక్కువ విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెిపింది. హైదరాబాద్ మెట్రో రైలు గత కొన్ని సంవత్సరాలుగా ఆర్థికంగా తీవ్ర నష్టాలను తెచ్చిపెడుతుందని ఎల్ అండ్ టి సంస్థ చెబుతుంది. ఆపరేషన్ నష్టాలు కొన్ని సంవత్సరాలుగా పేరుకుపోవడంతో మెట్రో రైలు నిర్వహణ కష్ట సాధ్యంగా మారిందని ఎల్ అండ్ టి సంస్థ తెలిపింది.
గత నెలలోనే లేఖను పంపినా...
ఆగస్టు నెలలోనే హౌసింగ్ అండ్ అర్బన్ డెవలెప్ మెంట్ శాఖకు లేఖను పంపామని, అయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి తమకు ఆశించిన స్థాయిలో ఆర్థిక సాయం అందడం లేదని తెలిపింది. దీంతో తమ సంస్థ మెట్రో రైలు వల్ల మరింత నష్టాలను ఎదుర్కొనే ఛాన్స్ ఉందని, అది భరించలేక తమ వాటాను అమ్మకానికి పెట్టేందుకు ముందుకు వచ్చామని సంస్థ ప్రకటించింది. హైదరాబాద్ లో మెట్రో రైలు బాగా క్లిక్ అయింది. ఆక్యుపెన్సీ రేటు కూడా బాగానే ఉంది. అయితే నిర్వహణ కష్టాలు మాత్రం తడిసి మోపెడవుతున్నాయి. గతంలోనే ఎల్ అండ్ టి సంస్థ మెట్రో రైలును విక్రయించేందుకు సిద్ధమయింది.
నిర్వహణ ఖర్చులు...
ఫేజ్ -1 తో పాటు దాని ఆపరేషన్ మెయిన్ టెయినెన్స్, ఫేజ్ II A, ఫేజ్ II Bని కూడా తీసుకోవాలని ప్రతిపాదిస్తున్నట్లు ఎల్ అండి టి సంస్థ ప్రకటించింది. ప్రాజెక్టుల ఆలస్యం కావడంతో పాటు భూమి స్వాధీనం, అనేక విస్తరణ దశల్లో మార్పులు, యుటిలిటీ షిఫ్టింగ్ వంటి కారణాలతో తమ సంస్థను మరింత ఆర్థికంగా కుంగదీస్తుందని తెలిపింది. గత ఏడాది ఆపరేషన్ ద్వారా వచ్చిన ఆదాయం 1.108 కోట్లు అయిదే, 2023.-2024లో అది 1,399 కోట్లుగా ఉందని చెప్పింది. గత ఏడాదితో పోలిస్తే 21 శాతం తగ్గుదల కనిపించిందన్నారు. గత ఆర్థిక సంవత్సరం 555 కోట్లు నష్టం వస్తే, ఈ ఆర్థిక సంవత్సరం 625 కోట్లు నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మెట్రో రైలు ప్రారంభం కాగా రాష్ట్ర ప్రభుత్వం తగిన సమయంలో ఆర్థిక సాయం చేయకపోవంతో నష్టాలు మరింత పెరిగాయని తెలిపింది.