హైదరాబాద్‌లో మరోసారి ఐటీ దాడులు

హైదరాబాద్‌లో మరోసారి ఐటీ దాడులు జరుగుతున్నాయి

Update: 2025-12-02 06:19 GMT

హైదరాబాద్‌లో మరోసారి ఐటీ దాడులు జరుగుతున్నాయి. వుడ్‌ బ్రిడ్జ్‌ హోటల్‌ యజమాని ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. హోటల్‌ ఓనర్‌ అలీఖాన్‌ను అధికారులు విచారించారు. గతంలోనూ షా గౌస్, పిస్తా హౌస్ ల యాజమాన్యం, డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు జరిగిన నేపథ్యంలోనే ఈ దాడులు జరుగుతున్నట్లు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

గతంలో జరిగిన ఐటీ దాడుల్లో...
గతంలో ఐటీ దాడులు జరిగిన హోటళ్లతో సంబంధాలపై ఆరా తీస్తున్నారు. ఇటీవలే షాగౌస్‌, పిస్తాహౌస్‌, మెహఫిల్‌ రెస్టారెంట్ల యజమానుల ఇళ్లలో సోదాలు జరిగాయి. సోదాల్లో భారీగా నగదు గుర్తించిన ఐటీ అధికారులు ఈరోజు వుడ్ బ్రిడ్జి హోటల్ యాజమానుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.


Similar News