Revanth Reddy : ఫుట్‌బాల్ ప్రాక్టీస్ లో రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేశారు

Update: 2025-12-01 04:49 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేశారు. ఎంసీహెచ్ఆర్డీ వద్ద ఆయన ఫుల్ ప్రాక్టీస్ చేశారు. ముఖ్యమంత్రి ఈ నెలలో జరిగే ఫ్లెండ్లీ మ్యాచ్ లో పాల్గొననున్న నేపథ్యంలో ముందుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా పర్యటనకు బయలుదేరే ముందు ఆయన ఉదయం ఫుట్ బాల్ ప్రాక్టీస్ చేశారు.

ఈ నెల 13న మెస్సీ...
డిసెంబర్ 13న హైదరాబాద్‌కు ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ రానున్నారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ మ్యాచ్ లో మెస్సీ పాల్గొననున్నారు. మెస్సీతో కలిసి ఫుట్‌బాల్ ను కాసేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆడనున్నారరు. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి మ్యాచ్ కోసం ప్రాక్టీస్ మొదలు పెట్టారు. కాసేపు ప్రాక్టీస్ చేసిన ముఖ్యమంత్రి అనంతరం అక్కడి నుంచి ఇంటికి వెళ్లి తర్వాత మహబూబ్ నగర్ పర్యటనకు బయలుదేరి వెళతారు.


Tags:    

Similar News