Hyderabad : జీహెచ్ఎంసీ విస్తరణకు గవర్నర్ ఓకే
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ విస్తరణకు సంబంధించిన ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం తెలిపారు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ విస్తరణకు సంబంధించిన ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం తెలిపారు. జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీలను విలీనం చేస్తూ ఇటీవల కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఆర్డినెన్స్ ను రూపొందించించి గవర్నర్ కు పంపింది. గవర్నర్ ఈ ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిని విస్తరిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి గవర్నర్ ఆమోదం తెలిపారు.
27 మున్సిపాలిటీలను...
హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న దాదాపు ఇరవై మున్సిపాలిటీలను హైదరాబాద్ నగర పాలక సంస్థలో కలుపుతూ ఇటీవల తెలంగాణ మంత్రి వర్గ సమావేశం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఔటర్ రింగ్ రోడ్డు లోపల, బయట ఉన్న ఈ మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ చేసిన ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం తెలపడంతో జీహెచ్ఎంసీ పరిధి విస్తరించినట్లయింది.