దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించబోతుందన్నారు. మూడు వందల డివిజన్లలో ఎంఐఎం, కాంగ్రెస్ కలిపి అత్యధిక స్థానాలను చేజిక్కించుకుంటామని తెలిపారు. తాను కాంగ్రెస్ పార్టీనేనని ఆయన తెలిపారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచిన దానం నాగేందర్ 2024 లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున సికింద్రాబాద్ అభ్యర్థిగా పోటీ చేశారు.
అనర్హత పిటీషన్ ఉన్న సమయంలో...
ఆయనపై బీఆర్ఎస్ అనర్హత పిటీషన్ వేసింది. దీంతో దానం నాగేందర్ పై అనర్హత వేటు పడుతుందని భావిస్తున్న సమయంలో ఆయన ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో దానం నాగేందర్ తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని స్పష్టం చేసి తాను బీఆర్ఎస్ కాదని స్పష్టం చేశారు. మూడు వందల డివిజన్లలో పర్యటించి తాను కాంగ్రెస్ గెలుపుకోసం పనిచేస్తానని దానం నాగేందర్ తెలిపారు.