Hydra : శంషాబాద్ లో అక్రమ నిర్మాణలను కూల్చివేసిన హైడ్రా
హైడ్రా అధికారులు కూల్చివేతలు మొదలు పెట్టారు. ఈరోజు హైడ్రా అధికారులు రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో ఆక్రమణలను కూల్చివేశారు
హైడ్రా అధికారులు కూల్చివేతలు మొదలు పెట్టారు. ఈరోజు హైడ్రా అధికారులు రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని సర్వే నంబర్ 217లో ఉన్న పన్నెండు ఎకరాల భూముల్లో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఈ భూమిని ప్రభుత్వం 2011లో ఇంటర్మీడియట్ బోర్డుకు కేటాయించింది. అయితే ఇందులో కొన్ని అక్రమ నిర్మాణాలు వెలిశాయి.
ఫిర్యాదు అందడంతో...
హైడ్రా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఇటీవల ఒక ప్రైవేట్ నిర్మాణ సంస్థ భూమిని ఆక్రమించి నిర్మాణాలు ప్రారంభించింది. ఈ మేరకు హైడ్రా అధికారులకు ఫిర్యాదు అందింది. ఫిర్యాదు అందిన నేపథ్యంలో హైడ్రా అధికారులు పోలీసు సిబ్బంది సమక్షంలో ఆ అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు.