నేడు రెండోరోజు వింగ్స్ ఇండియా-2026
నేడు రెండోరోజు వింగ్స్ ఇండియా-2026 ప్రదర్శన హైదరాబాద్ లో జరుగుతుంది
నేడు రెండోరోజు వింగ్స్ ఇండియా-2026 ప్రదర్శన హైదరాబాద్ లో జరుగుతుంది. నిన్న కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వింగ్స్ ఇండియా ప్రదర్శనను ప్రారంభించారు. ఈ ప్రదర్శనల అనేక ఎయిర్ క్రాఫ్ట్స్ పాల్గొంటున్నాయి. విమానాల విన్యాసాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్ లో ప్రతి ఏడాది వింగ్స్ ఇండియా ప్రదర్శనను నిర్వహిస్తూ వస్తున్నారు. ఇరవై దేశాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
రేపు, ఎల్లుండి...
వింగ్స్ ఇండియా-2026 ప్రదర్శన లో ప్రత్యేక ఆకర్షణగా పలు ఎయిర్ క్రాప్ట్స్ నిలిచాయి. విమానాల విన్యాసాలు అలరిస్తున్నాయి. దీనిని ప్రత్యక్షంగా చూసే అవకాశం కూడా హైదరాబాద్ వాసులకు వింగ్స్ ఇండియా నిర్వాహకులు కల్పించనున్నారు. రేపు, ఎల్లుండి సాధారణ ప్రజలకు వింగ్స్ ఇండియా ప్రదర్శనలకు అనుమతి ఇవ్వనున్నారు. రెండు రోజుల పాటు సాధారణ ప్రజలు విమాన విన్యాసాలను చూసే అవకాశముంది.