Hydra : హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు
హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది. ఉదయం నుంచి కొండాపూర్ లో కూల్చివేతలను చేపట్టింది
హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది. ఉదయం నుంచి కొండాపూర్ లో కూల్చివేతలను చేపట్టింది. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన హైడ్రా అధికారులు కొండాపూర్ లోని పార్క్ స్థలాన్ని ఆక్రమించారని నిర్ధారించుకున్న తర్వాత ఆక్రమణలను కూల్చివేయాలని నిర్ణయించింది. దీంతో ఉదయం హైడ్రా బుల్ డోజర్లు కొండాపూర్ కు చేరుకున్నాయి.
కొండాపూర్ లోని...
కొండాపూర్ లోని ఆల్విన్ పార్క్ కాలనీలో గత కొద్ది కాలం నుంచి ఆక్రమణలు పెరిగిపోయాయి. దీంతో ప్రతి సోమవారం జరిగే హైడ్రా ప్రజావాణి కార్యక్రమంలో స్థానికులు ఫిర్యాదు చేయడంతో వాటిని పరిశీలించిన అధికారులు ఆక్రమణలను కూల్చివేస్తున్నారు. ఈ సందర్భంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమిస్తే కూల్చివేయడానికి హైడ్రా సిద్ధంగా ఉంటుందన్న సంకేతాలను పంపుతున్నారు.