Hyderabad : హైదరాబాద్ లో పెరిగిన వీధికుక్కల బెడద..చిన్నారులపై దాడులు

Hyderabad : హైదరాబాద్ లో పెరిగిన వీధికుక్కలు బెడద..చిన్నారులపై దాడులు

Update: 2026-01-04 08:33 GMT

హైదరాబాద్ లో కుక్కల బెడద ఎక్కువగా ఉంది. గోల్నాక డివిజన్ అన్నపూర్ణ నగర్ లో ఓ ఎనిమిది ఏళ్ల బాలుడు పై వీధి కుక్కలు మూక్కుమ్మడిగా దాడి చేసి తీవ్రంగాగాయపరిచాయి. కాళ్లు, గజ్జలు, వెనక భాగంలో రక్తం చిందేలా కుక్కలు కరిచాయి. దీంతో ఆ బాలుడు వణికిపోయి పరుగులు తీయడంతో వెంటపడి మరీ కుక్కలు కరిచాయి.పోలీసులు తెలిపిన కథనం ప్రకారం గోల్నాక అన్నపూర్ణ నగర్ లోమల్లేష్ అనే వ్యక్తి ఇటీవలనే కిరాయికి వచ్చాడు. అతని కుమారుడు ఎనిమిదేళ్ల రుత్విక్ సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో బస్తీలోని సాయిబాబా గుడి దగ్గర తన స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నాడు.

ఒక్కసారిగా దాడిచేయడంతో
అదే సమయంలో అక్కడకు వచ్చిన ఎనిమిది వీధి కుక్కలు ఒక్కసారిగా ఆ బాలుడు పై దాడి చేశాయి. ఎక్కడపడితే అక్కడకరిచాయి. ఇది గమనించిన స్థానికులువెంటనే ఆ కుక్కలను తరిమికొట్టి వాటి నుంచి ఆ బాలుడిని రక్షించారు. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా.. ఆ బాలుడు ని తీసుకొని మొదట సల్లకుంటలోని ఫీపర్ హాస్పిటల్ కి వెళ్ళారు. కుక్క కాటు తీవ్రంగా ఉండడంతో వారు ప్రాథమిక చికిత్స చేసి తదుపరి మంచి చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన స్థానికంగా ఆందోళనకు గురిచేసింది. ఈ ప్రాంతంలో కుక్కల బెడద తీవ్రంగా ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
అధికారులకు ఫిర్యాదు చేసినా...
మహిళలు చిన్నపిల్లలపై దాడులు చేస్తున్నాయని ఎన్ని మార్లు జీహెచ్ఎంసీ అధికారులకు తెలిపినా స్పందించడం లేదని అంటున్నారు. ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కమల నగర్ లో కూడా ఓ బాలికను కుక్కలు మూసి లోకి వెళ్ళిన సంఘటన చోటుచేసుకుందని స్థానికులు గుర్తు చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కుక్కల బెడద నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. వీధికుక్కలను తీసుకెళ్లాలని లేకపోతే తమ ప్రాంతంలో మనుగడ కూడా కష్టంగా మారుతుందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.


Tags:    

Similar News