Hyderabad : సెప్టంబరు 6న హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జనం
హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జనం వచ్చే నెల 6వ తేదీన జరగనుంది.
హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జనం వచ్చే నెల 6వ తేదీన జరగనుంది. ఆరోజు హైదరాబాద్ లోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలకు సెలవు ప్రకటించింది. సెప్టంబరు 6వ తేదీన శనివారం కావడంతో ఎక్కువ మంది భక్తులు నిమజ్జనంలో పాల్గొనే అవకాశముండటంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి కూడా పోలీసులను రప్పిస్తున్నారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి...
సెప్టెంబర్ 6వ తేదీన ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం జరగనుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే పాడయిపోయిన రహదారులను బాగు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో అనేక చోట్ల నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేశారు. ట్యాంక్ బండ్ వద్దకు పెద్దసంఖ్యలో విగ్రహాలు వస్తాయని భావించి అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం నుంచి ఆదివారం వరకూ హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి.