Hyderabad : హైదరాబాద్ లో కొనసాగుతున్న గణేశ్ నిమజ్జనం

హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జనం కొనసాగుతుంది. నిన్న ఉదయం ప్రారంభమయిన గణేశ్ నిమజ్జనం ఈరోజు మధ్యాహ్నం వరకూ కొనసాగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

Update: 2025-09-07 02:50 GMT

హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జనం కొనసాగుతుంది. నిన్న ఉదయం ప్రారంభమయిన గణేశ్ నిమజ్జనం ఈరోజు మధ్యాహ్నం వరకూ కొనసాగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ట్యాంక్ బండ్ తో పాటు నగరంలో ఏర్పాటు చేసిన వివిధ చెరువుల్లో దాదాపు 2.66 లక్షల వినాయక విగ్రహాల నిమజ్జనం జరిగిందని అధికారులు తెలిపారు. ఇంకా కొన్ని విగ్రహాలు నిమజ్జనం కావాల్సి ఉందని అధికారులు తెలిపారు. పూర్తిగా నిమజ్జనం పూర్తయ్యేందుకు మధ్యాహ్నం అవుతుందని అంచనా వేస్తున్నారు.

సాయంత్రం వరకూ...
ట్యాంక్ బండ్ వద్ద ఇప్పటికే అనేక గణేశ్ విగ్రహాలు నిమజ్జనం కోసం వేచి ఉన్నాయి. వారికి కేటాయించిన క్రేన్ల కోసం వేచి చూస్తున్నారు. ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం నిన్న మధ్యాహ్నం 1.30 గంటలకే పూర్తయింది. బాలాపూర్ గణేశుడి విగ్రహం కూడా నాలుగు గంటలకు పూర్తయింది. అయితే నగర శివార్ల నుంచి వచ్చే విగ్రహాల రాక ఆలస్యం కావడంతో ఇంకా ట్యాంక్ బండ్ వద్ద ఇంకా ట్రాఫిక్ ఇబ్బందులు నెలకొన్నాయి. సాయంత్రం వరకూ ఇదే రద్దీ కొనసాగుతుందని, చంద్రగ్రహణం ఏర్పడనుండటంతో వేగంగా విగ్రహాల నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.


Tags:    

Similar News