Danam Nagender : కేటీఆర్ పై దానం ఫైర్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై కేటీఆర్‌ వ్యాఖ్యలకు దానం కౌంటర్ ఇచ్చారు

Update: 2025-12-27 07:58 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై కేటీఆర్‌ వ్యాఖ్యలకు దానం కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రిని ఏకవచనంతో మాట్లాడడం సరికాదని అన్నారు. సీఎం పదవికి గౌరవం ఇవ్వాలని దానం నాగేందర్ అన్నారు. విమర్శలు చేస్తే ప్రతి విమర్శలు కూడా ఎదుర్కొనాల్సి ఉంటుందని, అందుకు సిద్ధపడితేనే విమర్శలు చేయాలని దానం నాగేందర్ అన్నారు.

కార్యకర్తల వల్లనే...
కార్యకర్తల వల్లే నేను తాను ఈ స్థాయిలో ఉన్నానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. తనకు కార్యకర్తలే బలం అని అన్న ఆయన కార్యకర్తల అండతో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పారు. ఉప ఎన్నిక వస్తే కూడా మరోసారి గెలుస్తానని దానం నాగేందర్ తెలిపారు. అయితే రాజీనామాపై మాత్రం ఎటువంటి ప్రకటన చేయలేదు.


Tags:    

Similar News