Hyderabad: హైదరాబాద్‌లో ముగ్గురు పోలీసులపై ఈసీ సస్పెన్షన్‌ వేటు

నవంబర్‌ 30న తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి..

Update: 2023-11-29 14:48 GMT

నవంబర్‌ 30న తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ముగ్గురు పోలీసులపై ఎన్నికల కమిషన్‌ సస్పెన్షన్‌ వేటు వేసింది. సెంట్రల్‌ జోన్‌ డీసీపీ వెంకటేశ్వర్లు, చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి, ముషీరాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ జహంగీర్‌లపై ఈసీ సస్పెన్షన్‌ వేటు వేసింది. ఎన్నికల కోడ్‌ తర్వాత డబ్బుల కట్టడిలో పక్షపాతం చూపారనే కారణంగా ఈసీ వీరిపై సస్పెండ్‌ చేసింది.

ఎన్నికల కోడ్‌ తర్వాత డబ్బుల కట్టడిలో పక్షపాతం చూపారనే కారణంగా ఈసీ వీరిపై సస్పెండ్‌ చేసింది. అయితే విధి నిర్వహణ పక్షపాతం చూపించారని, క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ సీఎస్‌కు లేఖ రాసింది. అయితే ఎన్నికల తనిఖీల్లో మంగళవారం ముషీరాబాద్‌లో భారీ ఎత్తున నగదు పట్టుకున్నారు. ముషీరాబాద్‌లోని సంతోష్‌ ఎలైట్‌ అపార్ట్‌మెంట్‌లో 18 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ నగదు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ముఠా గోపాల్‌ కుమారుడు జైసింహకు చెందినగా గుర్తించారు పోలీసులు. దీంతో గుర్తు తెలియని వారిగా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో నిందితుల పేర్లను నమోదు చేశారు. గోపాల్‌ స్నేహితులు సుధాకర్‌, సంతోష్‌లను సైతం పోలీసులు అరెస్టు చేశారు. అయితే నిందితులను వదిలిపెట్టి సరైన సెక్షన్ల కింద కేసు నమోదు చేయలేదని ఎన్నికల కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో వీరిపై సస్పెన్షన్‌ వేటు వేసి నిర్ణయం తీసుకుంది ఈసీ.

Tags:    

Similar News