ఫ్యాక్ట్ చెక్: మలయాళ నటి పెళ్లి విజువల్స్ ను దేవదాసి వ్యవస్థ అంటూ అసత్యప్రచారం చేస్తున్నారు

దేవదాసీ వ్యవస్థ అనేది ఆరవ శతాబ్దానికి చెందిన చారిత్రాత్మకమైన, పురాతనమైన ఆచారం. భారతదేశంలో దేవదాసి వ్యవస్థ అన్నది

Update: 2025-02-27 12:21 GMT

Divya Sreedhar

దేవదాసీ వ్యవస్థ అనేది ఆరవ శతాబ్దానికి చెందిన చారిత్రాత్మకమైన, పురాతనమైన ఆచారం. భారతదేశంలో దేవదాసి వ్యవస్థ అన్నది ఆ స్త్రీ తన జీవితాంతం దేవుళ్ళకు లేదా ఆలయాన్ని పూజించడానికి, సేవ చేయడానికి అంకితమైన మహిళా కళాకారిణి. వారిని దేవుని భార్యలుగా పరిగణిస్తారు. వారు ఏ ఇతర వ్యక్తిని వివాహం చేసుకోవడానికి కూడా అనుమతించబడరు. 1988లో ఈ వ్యవస్థ చట్టవిరుద్ధం అయింది. సుప్రీంకోర్టు ఈ వ్యవస్థను రద్దు చేసిన తర్వాత కూడా కొన్ని రాష్ట్రాలలో దేవదాసీ పద్ధతిని అనుసరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇదిలావుండగా, దండలతో దక్షిణ భారత సాంప్రదాయ దుస్తులలో ఒక పురుషుడు, స్త్రీని చూపించే వీడియో వైరల్ అవుతూ ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో దేవదాసీ ఆచారాన్ని చూపుతుందనే వాదనతో ప్రచారంలో ఉంది. “1950 तक ये प्रथा थी भारत में, लोग कहते हैँ दक्षिणी भारत में आज भी है! देख कर लग रहा कितना शोषण रहा होगा महिलाओं का, सुना है दलित महिलाओं को ही बनाया जाता था!” అంటూ హిందీలో ఓ పోస్టు వైరల్ అవుతూ ఉంది. ఈ ఆచారం భారతదేశంలో 1950 వరకు ప్రబలంగా ఉంది. ఇది ఇప్పటికీ దక్షిణ భారతదేశంలో ఎక్కువగా పాటిస్తూ ఉన్నారని ప్రజలు అంటున్నారు! ఇది చూస్తుంటే స్త్రీలు ఎంత దోపిడీని ఎదుర్కొంటారో అనిపిస్తోంది, దళిత స్త్రీలను మాత్రమే అలా తయారు చేశారని విన్నానని ఆ పోస్టుల్లో తెలిపారు.



వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు.

ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వీడియోలో ఉన్నది దేవదాసీ వ్యవస్థ కాదు. మలయాళీ నటి దివ్య శ్రీధర్ వివాహానికి సంబంధించిన విజువల్స్ ఇవి. ఈ వీడియో నుండి కీఫ్రేమ్‌లను తీసుకుని Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి తనిఖీ చేసినప్పుడు, వీడియో అక్టోబర్ 2024లో గురువాయూర్‌లో జరిగిన దివ్య శ్రీధర్, క్రిస్ వేణుగోపాల్ వివాహాన్ని చూపుతున్నట్లు మాకు తెలుస్తోంది. 
ఆన్ మనోరమ కథనం ప్రకారం, బుల్లితెర నటులు క్రిస్ వేణుగోపాల్, దివ్య శ్రీధర్ గురువాయూర్‌లోని ఒక ప్రైవేట్ కార్యక్రమంలో వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి 'పాతరమట్టు' సీరియల్‌లో కలిసి పనిచేశారు, ఆ తర్వాత వారు వివాహం చేసుకోవాలని అనుకున్నారు.
టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం కూడా వీరి వివాహానికి సంబంధించిన చిత్రాలను పంచుకుంది. దివ్య శ్రీధర్ ప్రతిభావంతురాలైన నటి అని వివిధ టెలివిజన్ షోల ద్వారా ఆమె పాపులారిటీని సొంతం చేసుకున్నారు. ఆమెకు అంతకు ముందు జరిగిన వివాహం కారణంగా ఇద్దరు పిల్లలు ఉన్నారు.
“Patharamattu Moorthi Sir & Divya Sreedhar Wedding | Kriss Venugopal and Divya Sreedharl Wedding” అనే టైటిల్ తో అక్టోబర్ 30, 2024న సెలెస్‌పాట్ మీడియా అనే యూట్యూబ్ ఛానెల్ ప్రచురించిన ఈ జంట వివాహం వీడియోను ఇక్కడ చూడొచ్చు.
Full View
వైరల్ వీడియోలో ఉన్నది దక్షిణ భారతదేశంలోని దేవదాసి సంస్కృతి కాదు. మలయాళీ నటి దివ్య శ్రీధర్ అక్టోబర్ 2024లో రెండవ వివాహం చేసుకున్నప్పటి వీడియో. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. 
Claim :  దక్షిణ భారతదేశంలోని సంపన్నులైన బ్రాహ్మణులు దళిత స్త్రీలను దేవదాసీ ఆచారంతో వేధిస్తున్నట్టు చూపుతున్న వీడియో
Claimed By :  Twitter users
Fact Check :  Unknown
Tags:    

Similar News