ఫ్యాక్ట్ చెక్: ఢాకాలో చోటుచేసుకున్న ఘటనను భారత్ లో జరిగినదిగా ప్రచారం చేస్తున్నారు

సోషల్ మీడియా ఒక శక్తివంతమైన డిజిటల్ సాధనం. ఇటీవల కాలంలో సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగింది. డిజిటల్ ఇండియా, ఇంటర్నెట్ లభ్యత పెరగడంతో భారతదేశంలో

Update: 2026-03-16 08:46 GMT

సోషల్ మీడియా ఒక శక్తివంతమైన డిజిటల్ సాధనం. ఇటీవల కాలంలో సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగింది. డిజిటల్ ఇండియా, ఇంటర్నెట్ లభ్యత పెరగడంతో భారతదేశంలో సుమారు 500 మిలియన్లకు పైగా యాక్టివ్ సోషల్ మీడియా వినియోగదారులు ఉన్నారు. అందుకు తగ్గట్టుగా కంటెంట్ క్రియేటర్లు కూడా పెరిగిపోయారు. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్, ట్విటర్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ మంది ఫాలోవర్లను సంపాదించుకున్న వ్యక్తులు ఇన్‌ఫ్లుయన్సర్లుగా మారుతున్నారు. ప్రజలు కూడా వారిని బాగా ఫాలో అయిపోతున్నారు. ఏదైనా హాలిడే స్పాట్‌కు వెళ్లాలనుకున్నా ట్రావెల్ వ్లాగర్స్ చెప్పే విషయాల కోసం వెతుకుతున్నారు. కొత్తగా ఏదైనా రెస్టారెంట్‌కు వెళ్లాలన్నా ఫుడ్ ఇన్‌ఫ్లుయన్సర్లు చెప్పే విషయాలను జాగ్రత్తగా గమనిస్తున్నారు. అవి మనకు నచ్చితే టక్కున వాళ్లను అనుసరిస్తున్నాం. సోషల్ మీడియాలో వాటి గురించి వివరించే ఇన్‌ఫ్లూయన్సర్లను ఫాలో అవుతున్నాం.


సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు కొందరు ఆకతాయిలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పై దాడులు చేయడం, అనుచితంగా తాకడం వంటివి చేస్తూ ఉంటారు.

తాజాగా భారతదేశంలో ఓ రష్యన్ మహిళతో ఓ వ్యక్తి అనుచితంగా ప్రవర్తించాడు అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.


https://x.com/TyrantOppressor/status/2031619434981494859

ఆర్కైవ్ లింక్
ఇక్కడ
ఉంది

వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు



 



ఫ్యాక్ట్ చెకింగ్:


వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది. ఇది ఢాకాలో చోటు చేసుకున్న ఘటన.

భారతదేశంలో ఒక రష్యన్ మోడల్‌ను ఒక భారతీయ వ్యక్తి అనుచితంగా తాకాడని, అది ఘర్షణకు దారితీసిందని చెబుతూ, రద్దీగా ఉండే రోడ్డుపై ఒక యువతి గొడవకు దిగినట్లుగా చూపించే వీడియోను ప్రచారం చేస్తున్నారు.

మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేశాం. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఈ సంఘటన భారతదేశంలో చోటు చేసుకున్నది కాదు, బంగ్లాదేశ్‌లో జరిగింది. ఈ సంఘటన భారతదేశంలో జరిగిందని లేదా ఇందులో ఉన్న వ్యక్తి భారతీయుడని నిర్ధారించే ధృవీకరించబడిన లేదా విశ్వసనీయ మూలాలు మాకు లభించలేదు.

ఇక సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేయగా monica_kabir_ అనే ఇంస్టాగ్రామ్ లో ఒరిజినల్ వీడియో మాకు లభించింది.

https://www.instagram.com/p/DVsbNlKj0ZR/

ఈ ఘటనకు సంబంధించి పలు కథనాలు ఆన్ లైన్ లో లభించాయి. ఈ ఘటన ఢాకాలో చోటు చేసుకుందంటూ మీడియా నివేదికలు తెలిపాయి. ఈ ఘటనకు సంబంధించిన లింక్స్ ను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.

రష్యాకు చెందిన మోనికా కబీర్ ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో నివసిస్తున్నారని మీడియా సంస్థలు తెలిపాయి. బంగ్లాదేశ్ వీధుల్లో జరిగిన ప్రమోషనల్ షూట్‌లో ఒక వృద్ధుడు తనను తాకాడంటూ ఓ వీడియోను ఆమె షేర్ చేసింది. ఆమె చుట్టూ తగినంత స్థలం ఉన్నప్పటికీ, ఆ వృద్ధుడు అకస్మాత్తుగా ఆమె దగ్గరికి వెళ్లి తన బ్యాగ్‌తో ఆమెను తోసివేసి, అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఆమె చెప్పింది. మోనికా వెంటనే తన చేతిలో పట్టుకున్న బ్యాగ్‌తో ఆ వ్యక్తిని కొట్టడం చూడొచ్చు. ఎక్కడా కూడా ఈ ఘటన భారతదేశంలో చోటు చేసుకుందని వెల్లడించలేదు.

ఇక కొన్ని మీడియా సంస్థలు ఆమెపై బంగ్లాదేశ్ లో కేసు నమోదు చేసినట్లుగా కథనాలను ప్రచురించాయి. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మోనికా కబీర్‌పై గుల్షన్ ప్రాంతంలో ఓ పాదచారిపై బహిరంగంగా దాడి చేసి అవమానించారనే ఆరోపణలతో ఢాకా కోర్టులో కేసు నమోదైంది. ఛత్ర అధికార్ పరిషత్ ఢాకా జిల్లా దక్షిణ విభాగం అధ్యక్షుడు సజ్జాద్ అల్ ఇస్లాం గురువారం, మార్చి 12, 2026న అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ జాకీర్ హుస్సేన్ కోర్టులో ఫిర్యాదు చేశారని పలు నివేదికలు తెలిపాయి. వాటిని
ఇక్కడ
, ఇక్కడ చూడొచ్చు.

వైరల్ వీడియోలో ఘటన ఢాకా నగరంలో చోటు చేసుకోవడం, సదరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మోనికా కబీర్‌ పై కేసు నమోదవ్వడం కూడా బాంగ్లాదేశ్ లో కాబట్టి, ఈ ఘటనతో భారతదేశానికి ఎలాంటి సంబంధం లేదు. 

కాబట్టి, వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది. వైరల్ వీడియోలోని ఘటన భారతదేశంలో చోటు చేసుకున్నది కాదు.


Claim :  ఈ ఘటన ఢాకాలో చోటు చేసుకుంది
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News