ఫ్యాక్ట్ చెక్: 2020 లో చోటు చేసుకున్న అగ్నిప్రమాదానికి సంబంధించిన విజువల్స్ ను దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం మీద ఇరాన్ మిస్సైల్ దాడులంటూ ప్రచారం చేస్తున్నారు

దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం మీద ఇరాన్ మిస్సైల్ దాడులంటూ ప్రచారం చేస్తున్నారు.

Update: 2026-03-18 03:23 GMT

ఒక నెల కిందట దుబాయ్, అబుదాబి నగరాలు పర్యాటకులతో కిక్కిరిసిపోయి ఉన్నాయి. పలు ప్రాంతాల్లో రవాణా, ఆర్థిక రంగాల వరకు వాణిజ్యం యథావిధిగా సాగుతోంది. అయితే ఊహించని విధంగా ఇప్పుడు యూఏఈ దేశం ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఆకాశంలో వాయు రక్షణ వ్యవస్థలు చురుకుగా పనిచేస్తున్నాయి, యుద్ధ విమానాలు గగనతలంపై గస్తీ కాస్తున్నాయి.


అమెరికా-ఇజ్రాయెల్ దాడులలో అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన తరువాత, ఇరాన్ మధ్యప్రాచ్యం అంతటా దాడులను ప్రారంభించింది, ముఖ్యంగా యూఏఈ లక్ష్యంగా మారింది. ఫిబ్రవరి 28న ఖమేనీ హత్య జరిగినప్పటి నుండి, ఇరాన్ ప్రతీకారంగా అనేక గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు, ఆస్తులను లక్ష్యంగా చేసుకుని వందలాది క్షిపణులు, డ్రోన్‌లను ప్రయోగించింది. ఇతర గల్ఫ్ దేశాల కంటే యూఏఈనే ఎక్కువగా నష్టపోతోందని నివేదికలు సూచిస్తున్నాయి. మార్చి 15 నాటికి, యూఏఈ వాయు రక్షణ వ్యవస్థలు 298 బాలిస్టిక్ క్షిపణులు, 15 క్రూయిజ్ క్షిపణులు, 1,606 డ్రోన్‌లను ఎదుర్కొన్నాయని అబుదాబి రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

యూఏఈలోని అల్ ధఫ్రా వైమానిక స్థావరం అమెరికాకు ఆతిథ్యం ఇస్తోంది. అందువల్ల, అమెరికా భూభాగాన్ని నేరుగా తాకకుండానే దాని ప్రయోజనాలపై దెబ్బకొట్టడానికి ఇది ఒక లక్ష్యంగా మారింది. ఇరాన్ అమెరికా ప్రధాన భూభాగాన్ని సులభంగా చేరుకోలేదు, కాబట్టి ఈ ప్రాంతంలోని దాని మిత్రదేశం ఇరాన్ ఆగ్రహాన్ని ఎదుర్కొంటోంది. ఇతర గల్ఫ్ దేశాలలో కూడా అమెరికా స్థావరాలు ఉన్నాయి కానీ,యూఏఈ కేవలం ఒక అమెరికా స్థావరానికి ఆతిథ్యం ఇవ్వడమే కాదు, అది అమెరికాకు ప్రధాన రక్షణ భాగస్వామి కూడా. 2024లో ఇరు దేశాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది, ఇది అధునాతన ఆయుధాలు, సంయుక్త విన్యాసాలతో కూడిన సంబంధాలను మరింత బలోపేతం చేసింది.

ఇంతలో "దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం మీద ఇరాన్ మిస్సైల్ దాడులకు సంబంధించిన వీడియో" అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. హైవే మీద వెళుతూ ఉండగా ఓ ప్రాంతంలో మంటలు ఎగసిపడుతూ ఉండడం మనం గమనించవచ్చు.

వైరల్ పోస్టులకు సంబంధించిన ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.


వైరల్ స్క్రీన్ షాట్ ఇక్కడ ఉంది



 

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ వీడియో 2020 నుండి ఆన్ లైన్ లో అందుబాటులో ఉంది.

వైరల్ వీడియోకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడం కోసం మేము గ్రోక్, జెమిని లాంటి ఏఐ చాట్ బాట్స్ ను అడిగాం. అయితే అవి ఈ ఘటన 2020లో చోటు చేసుకున్నదిగా తెలిపాయి.

ఈ ఫుటేజ్, ఆగష్టు 5, 2020న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అజ్మాన్ పబ్లిక్ మార్కెట్లో చెలరేగిన భారీ అగ్నిప్రమాదానికి సంబంధించినదిగా జెమినీ తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో ఎమిరేట్‌లోని పారిశ్రామిక ప్రాంతంలో ఈ మంటలు చెలరేగాయి. ఈ ఫుటేజ్‌ను పక్కనే ఉన్న హైవేపై వెళుతున్న వాహనంలోని ప్రయాణీకుడు చిత్రీకరించారు. వీడియోలో, "అజ్మాన్ సర్వీస్ కాంప్లెక్స్" వైపు చూపిస్తున్న గుర్తును చూడవచ్చు. కోవిడ్-19 భద్రతా చర్యల కారణంగా మార్కెట్ ను మూసివేయడంతో అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ అగ్నిప్రమాదంలో 100కి పైగా దుకాణాలు దగ్ధమయ్యాయి.



 



దీన్ని క్యూగా తీసుకుని మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేశాం. వైరల్ క్లిప్‌తో చాలా దగ్గరగా సరిపోలిన వీడియో యూట్యూబ్ లో లభించింది. ఈ వీడియోను ఆగష్టు 6, 2020న అప్లోడ్ చేశారు. అజ్మాన్‌లోని ఒక మార్కెట్‌లో జరిగిన అగ్నిప్రమాదాన్ని చూపిస్తుందని తెలిపారు. రెండు వీడియోలలోనూ, మండుతున్న భవనం పక్కన ఒక చిన్న తెల్లటి గది లాంటి నిర్మాణం కనిపిస్తుంది, దాని ముందు ఒక వీధి దీపం ఉంటుంది.

Full View


అంతేకాకుండా పలు మీడియా నివేదికలను బట్టి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అజ్మాన్ ఎమిరేట్‌లోని మార్కెట్‌లో చెలరేగిన భారీ అగ్నిప్రమాదంలో ఎటువంటి గాయాలు లేదా ప్రాణనష్టం జరగలేదని, మంటలను అదుపులోకి తెచ్చామని అజ్మాన్ పోలీసులు తెలిపారు. కరోనావైరస్ జాగ్రత్తల కారణంగా నాలుగు నెలలుగా మూసి ఉన్న మార్కెట్‌లోని కొన్ని భాగాలు పూర్తిగా కాలిపోయాయని అధికారులు తెలిపారు.

ఆ మీడియా కథనాలు, అందుకు సంబంధించిన విజువల్స్ ను ఇక్కడ చూడొచ్చు.

https://www.facebook.com/watch/?v=3058894980873719

Full View


Full View


ఇక ఈ ఘటన చోటు చేసుకున్న ప్రాంతానికి సంబంధించిన జియో లొకేషన్ ను కూడా మేము గుర్తించాం.



 

 అందులో ఉన్న బోర్డు, వైరల్ వీడియోలో ఉన్న సైన్ బోర్డు ఒకటేనని స్పష్టంగా తెలుస్తోంది.


ఇక వైరల్ వీడియోలోని షాపింగ్ సెంటర్ అక్షరాలు కూడా మేము గుర్తించాం. రెండూ ఒకటేనని తేలింది.



 



కాబట్టి, 2020 ఆగస్టు నెలలో చోటు చేసుకున్న ఘటనను ఇటీవలిదిగా వైరల్ చేస్తున్నారు.


Claim :  వైరల్ అవుతున్న వీడియో 2020 నుండి ఆన్ లైన్ లో ఉంది
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News