ఫ్యాక్ట్ చెక్: భారత జర్నలిస్ట్ ఆదిత్య రాజ్ కౌల్ ను ఇజ్రాయెల్ దళాలు అరెస్ట్ చేశాయనే వాదనలో ఎలాంటి నిజం లేదు
భారత జర్నలిస్ట్ ఆదిత్య రాజ్ కౌల్ ను ఇజ్రాయెల్ దళాలు అరెస్ట్ చేశాయనే వాదనలో ఎలాంటి నిజం లేదు
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేస్తోంది. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరణించారంటూ వార్తలు వచ్చాయి. దీన్ని ఆయన స్వయంగా ఖండించారు. ఇరాన్ చేపట్టిన మిస్సైళ్ల దాడుల్లో ఇజ్రాయెల్ పీఎం బెంజమిన్ నెతన్యాహు మరణించారంటూ రకరకాల వార్తలు వచ్చాయి. ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ఆయన తన చేతిని చూపిస్తూ తనకు ఐదు వేళ్లు ఉన్నాయని చెప్పారు. ఓ షాపులో కాఫీ ఆర్డర్ చేస్తూ కనిపించారు నెతన్యాహు. తనకేమీ కాలేదని, ప్రాణాలు పోయినా తన దేశాన్ని ప్రేమిస్తూనే ఉంటానని, ఈ క్లిష్ట సమయంలో ప్రజల ధైర్యాన్ని ఆయన ప్రశంసించారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలపై ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం స్పందించింది. అవన్నీ అసత్యాలని, ప్రధాని బెంజిమన్ క్షేమంగా ఉన్నారని తెలిపింది.
ఇజ్రాయెల్ పీఎం బెంజిమన్ నెతన్యాహుకు ఇరాన్‌కి చెందిన రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఓ హెచ్చరిక జారీ చేసింది. పిల్లల ప్రాణాలు తీసే వ్యక్తి ఇంకా బతికే ఉంటే తమ శక్తి మేరా వెంటాడతామని స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ పీఎం మరణంపై వస్తున్న తప్పుడు వార్తలని ఇజ్రాయెల్ పేర్కొన్న కొన్ని గంటల్లో ఐఆర్‌జీసీ హెచ్చరికలు జారీ చేసింది.
నెతన్యాహు ఆచూకీని వెల్లడించినందుకు భారతీయ జర్నలిస్ట్ ఆదిత్య రాజ్ కౌల్‌ను ఇజ్రాయెల్‌లో అరెస్టు చేశారంటూ పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇరాన్ క్షిపణి దాడి సమయంలో బెంజమిన్ నెతన్యాహు ఆచూకీ వెల్లడించిన ఆరోపణలపై భారత జర్నలిస్ట్ ఆదిత్య రాజ్ కౌల్‌ను ఇజ్రాయెల్ పోలీసులు అరెస్టు చేశారని ఆ పోస్టుల్లో తెలిపారు.
వైరల్ పోస్టులకు సంబంధించిన ఆర్కైవ్ లింక్స్ ను ఇక్కడ చూడొచ్చు
వైరల్ స్క్రీన్ షాట్ ఇక్కడ ఉంది
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేశాం. అయితే భారతీయ జర్నలిస్ట్ ఆదిత్య రాజ్ కౌల్‌ను ఇజ్రాయెల్‌లో అరెస్టు చేశారనే వాదనలకు బలం చేకూర్చే మీడియా కథనాలు ఏవీ మాకు లభించలేదు.
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆచూకీని వెల్లడించినందుకు భారత జర్నలిస్ట్ అరెస్టు అయ్యారని పుకార్లు వ్యాపిస్తున్నాయంటూ ఆదిత్యారాజ్ కౌల్ అరెస్ట్ జరగలేదంటూ కొన్ని మీడియా కథనాలు మాకు లభించాయి. వాటిని ఇక్కడ చూడొచ్చు.
ఇక జర్నలిస్ట్ ఆదిత్య రాజ్ కౌల్ సోషల్ మీడియా ఖాతాలను మేము పరిశీలించాం. తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఆదిత్య రాజ్ కౌల్ తన అరెస్ట్ వార్తలను ఖండించారు.
"Enjoying Knafeh in Israel while an entire battery of paid Pakistani/Iranian/Indian Fake Accounts and Trolls use my News Reportage videos for their own propaganda and disinformation. Don’t believe all the BS you read on Social Media or Whatsapp without any verification." అంటూ ఆయన తన ఖాతాలో పోస్టు పెట్టారు. ఇజ్రాయెల్‌లో ఉన్నానని.. పాకిస్తానీ/ఇరానియన్/భారతీయ నకిలీ ఖాతాలు, ట్రోల్స్ మొత్తం నా న్యూస్ రిపోర్టేజ్ వీడియోలను వారి స్వంత ప్రచారం, తప్పుడు సమాచారం కోసం ఉపయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎటువంటి ధృవీకరణ లేకుండా సోషల్ మీడియా లేదా వాట్సాప్‌లో చదివే వార్తలను నమ్మి మోసపోవద్దని ఆయన కోరారు.
మీరు కూడా ఇంటర్నెట్‌లో నా గురించి కొన్ని నకిలీ కథనాలను చదివి ఉంటే, వాటిని గుడ్డిగా నమ్మవద్దు. పాకిస్తాన్ ISI అనుబంధ సోషల్ మీడియా ఖాతాలు అలాగే భారతదేశంలోని నిరాశ చెందిన ఒక రాజకీయ పార్టీకి చెందిన IT సెల్ మద్దతు ఉన్న ఇరానియన్ మీడియా భారీ తప్పుడు సమాచార ప్రచారంలో పాల్గొంటున్నాయని కూడా ఆదిత్య రాజ్ కౌల్ స్పష్టం చేశారు.
వైరల్ అవుతున్న వీడియోలోని విజువల్స్ ను మార్చి 15న అప్లోడ్ చేశారు.
ఆ తర్వాత కూడా పలు వీడియోలను, పోస్టులను జర్నలిస్ట్ ఆదిత్య రాజ్ కౌల్ సోషల్ మీడియా ఖాతాలో మనం చూడొచ్చు.
https://x.com/AdityaRajKaul
వైరల్ అవుతున్న వాదనను ఖండిస్తూ పలు ఫ్యాక్ట్ చెక్ సంస్థలు కూడా కథనాలను ప్రచురించాయి.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు
Claimed By : Social Media Users
Fact Check : Unknown