ఫ్యాక్ట్ చెక్: రష్మిక-విజయ్ దేవరకొండ వెడ్డింగ్ రిసెప్షన్ లో కుక్క దాడి చేసినట్లుగా ఏఐ వీడియోను వైరల్ చేస్తున్నారు

రష్మిక-విజయ్ దేవరకొండ వెడ్డింగ్ రిసెప్షన్ లో కుక్క దాడి

Update: 2026-03-09 04:32 GMT

విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్ లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. ఈ రాయల్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కు అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటను అభిమానులు ప్రేమగా 'విరోష్' అని పిలుస్తుంటారు. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు, పబ్లిక్ అపియరెన్సెస్ కారణంగా అభిమానుల్లో ప్రత్యేకమైన అభిమానాన్ని సంపాదించారు. హైదరాబాద్‌లో జరిగిన గ్రాండ్ రిసెప్షన్‌కు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.


అటు తెలుగు, ఇటు కొడవ సాంప్రదాయ పద్ధతుల్లో విజయ్, రష్మికల పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత వారు తమ సొంత ఊర్లకు వెళ్లి నిర్వహించిన సంప్రదాయ పూజలు నిర్వహించారు.

ఇక విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా వెడ్డింగ్ రిసెప్షన్ కు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అల్లు అర్జున్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. వీరందరితో కలిసి ఫోటో దిగుతున్న సమయంలో ఓ కుక్క రష్మిక మందన్నా మీదకు ఎగిరినట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

వైరల్ వీడియోకు సంబంధించిన ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.

వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇక్కడ ఉంది



 



ఫ్యాక్ట్ చెకింగ్:


వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వీడియోను ఏఐ ద్వారా సృష్టించారు.

విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా వెడ్డింగ్ రిసెప్షన్ కు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అతిథుల్లో అల్లు అర్జున్ కూడా ఉన్నారు. అల్లు అర్జున్ అలా ఫోటో దిగే సమయంలో కుక్క రష్మిక మీదకు ఎగిరినట్లుగా ఎలాంటి వీడియోను మాకు లభించలేదు.

అల్లు అర్జున్ వచ్చినప్పటి నుండి విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా జంటతో ఫోటో దిగే వరకూ ఉన్న విజువల్స్ ను మేము పరిశీలించాం. అయితే ఎక్కడా కూడా వైరల్ వీడియోలోని ఘటన చోటుచేసుకోలేదు.

Full View


Full View



వైరల్ వీడియోలోని అసలు వీడియోను ఇక్కడ చూడొచ్చు

Full View


Full View


మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేయగా మాకు ఎలాంటి మీడియా కథనాలు కూడా లభించలేదు. 

వైరల్ వీడియో కింద కామెంట్స్ ను చూడగా పలువురు నెటిజన్లు ఈ ఏఐ అంటూ కామెంట్స్ చేశారు. దీన్ని బట్టి ఏఐ వీడియోను పోస్టు చేశారని మేము గుర్తించాం. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు. 



 



ఇక వైరల్ వీడియోను నిశితంగా పరిశీలించగా కుక్క ఒక్కసారిగా ఎగరగానే అక్కడ ఉన్న వారి ముఖాలు తేడాగా కనిపించడం మనం గమనించవచ్చు. ఇది సాధారణంగా ఏఐ ద్వారా సృష్టించిన వీడియోలలో కనిపించే పొరపాట్లు.



 



 



 



ఈ వీడియోను ఏఐ డిటెక్షన్ టూల్స్ ద్వారా పరిశీలించగా వైరల్ వీడియో ఏఐ అని తేల్చాయి. హైవ్ ఏఐ డిటెక్షన్ టూల్ ను ఉపయోగించి చూడగా వైరల్ వీడియో ఏఐ ద్వారా సృష్టించారని స్పష్టం చేసింది.


 



కాబట్టి, వైరల్ అవుతున్న వీడియోను ఏఐ ద్వారా సృష్టించారు. రష్మిక-విజయ్ దేవరకొండ వెడ్డింగ్ రిసెప్షన్ లో కుక్క దాడి చేసిందనే వాదనలో ఎలాంటి నిజం లేదు.


Claim :  రష్మిక-విజయ్ దేవరకొండ వెడ్డింగ్ రిసెప్షన్ లో కుక్క దాడి చేసింది
Claimed By :  Social media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News