ఫ్యాక్ట్ చెక్: అత్యాచారం జరిగిన 24 గంటల్లోపు చర్యలు తీసుకోకపోతే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పలేదు

అత్యాచారం జరిగిన 24 గంటల్లోపు చర్యలు తీసుకోకపోతే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని

Update: 2026-03-12 06:42 GMT

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పశ్చిమ బెంగాల్ పర్యటనపై చర్చ జరుగుతోంది. డార్జిలింగ్ జిల్లాలో జరిగిన అంతర్జాతీయ సంతల్ సదస్సు ఏర్పాట్లపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సంతాల్ సదస్సుకు బెంగాల్ ప్రభుత్వం తొలుత అనుమతి ఇవ్వలేదు. చివరి నిమిషంలో వేదిక మార్చాల్సి వచ్చింది. దీంతో సదస్సుకు కొద్దిమంది ప్రతినిధులు మాత్రమే హాజరయ్యారు. రాష్ట్రపతి రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి, మంత్రులు హాజరవ్వాల్సి ఉంటుంది. కానీ ద్రౌపది ముర్మును స్వాగతించేందుకు సీఎం మమతా బెనర్జీ సహా మంత్రులు కూడా రాలేదు. దీంతో రాష్ట్రపతి అసహనం వ్యక్తం చేశారు. అలాగే సదస్సు ఏర్పాట్లపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు.


సాధారణంగా రాష్ట్రపతి ఒక రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి, మంత్రులు స్వాగతం పలకడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ముర్ముకు రాష్ట్రం నుంచి ఎటువంటి స్వాగతం కానీ ఆహ్వానం కానీ లభించలేదు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం అవమానించడం నిజంగా సిగ్గుచేటు అని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. గతంలో ఇలాంటి పరిణామం ఇప్పుడూ జరగలేదని చెప్పారు. బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని హద్దులూ దాటేసిందని అన్నారు. బెంగాల్‌ ప్రభుత్వ చర్యలతో ప్రజాస్వామ్యవాదులు, గిరిజనుల మనోభావాలు గాయపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన మహిళ అయిన ద్రౌపదీ ముర్ము ఆవేదన విని దేశ ప్రజల హృదయాలు బాధతో నిండిపోయాయన్నారు. రాష్ట్రపతిని కించపర్చారని, దీనికి బెంగాల్‌ ప్రభుత్వమే బాధ్యత వహించాలని మోదీ అన్నారు.

ఇంతలో సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి. అత్యాచారం జరిగిన 24 గంటల్లోపు చర్యలు తీసుకోకపోతే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారన్నట్లుగా కొన్ని పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి.

వైరల్ పోస్టులకు సంబంధించిన ఆర్కైవ్ లింక్స్ ను ఇక్కడ చూడొచ్చు

వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇక్కడ ఉంది



 



ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అలాంటి ప్రకటన ఏదీ చేయలేదు.

అత్యాచారం జరిగిన 24 గంటల్లోపు చర్యలు తీసుకోకపోతే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారా? లేదా? అని తెలుసుకోవడం కోసం మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేశాం. అయితే మాకు ఎలాంటి సంబంధిత కథనాలు కూడా లభించలేదు.

రాష్ట్రపతి అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే అది తప్పనిసరిగా మీడియా దృష్టిని ఆకర్షించి ఉండేది.

భారత రాష్ట్రపతికి సంబంధించిన అధికారిక సోషల్ మీడియా ఖాతాలను కూడా పరిశీలించాం. అయితే, ఆమె అలాంటి ప్రకటన చేసినట్లు ఎటువంటి ఆధారాలు దొరకలేదు.

అయితే వైరల్ అయిన వాదనను ఖండిస్తూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ యూనిట్ 11 ఫిబ్రవరి 2026న జారీ చేసిన వివరణను మేము కనుగొన్నాము. సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న పోస్ట్‌లో ఎలాంటి నిజం లేదని తెలిపింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారని తప్పుగా ఆపాదించారని PIB పేర్కొంది. ఈ వాదన నకిలీదని, రాష్ట్రపతి ముర్ము అలాంటి ప్రకటన ఏదీ చేయలేదని, ఆ కోట్ ఆమెకు తప్పుగా ఆపాదించినట్లుగా PIB స్పష్టం చేసింది.

"An Instagram post circulating on social media states that President Droupadi Murmu said that 'if a rape occurs in any state and the State government does not take action within 24 hours, the Chief Minister of that state should immediately resign.'
#PIBFactCheck
This claim is #fake.
President Droupadi Murmu has NOT given any such statement.
Rely only on official government sources for verified information" అంటూ పోస్టులో తెలిపారు.




అధికారిక సమాచారం https://x.com/rashtrapatibhvn లో లభిస్తుంది.


"దేశంలోని ఏదైనా రాష్ట్రంలో అత్యాచారం జరిగి..రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల్లోపు చర్య తీసుకోకపోతే, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నట్లు సామాజిక మాధ్యమంలో జరుగుతున్నప్రచారాన్ని భారత పత్రికా సమాచార కార్యాలయం-PIB ఖండించింది." అంటూ కూడా కొన్ని మీడియా సంస్థలు వివరణ ఇచ్చాయి.



కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. దేశంలోని ఏదైనా రాష్ట్రంలో అత్యాచారం జరిగి..రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల్లోపు చర్య తీసుకోకపోతే, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పలేదు


Claim :  అత్యాచారం జరిగిన 24 గంటల్లోపు చర్యలు తీసుకోకపోతే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు
Claimed By :  social media users
Fact Check :  Unknown
Tags:    

Similar News