ఫ్యాక్ట్ చెక్: దివ్యాంగ మహిళలకు పూర్తి స్థాయిలో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేయలేదు
దివ్యాంగ మహిళలకు పూర్తి స్థాయిలో ఉచిత బస్సు ప్రయాణం
రాష్ట్రంలోని దివ్యాంగుల సంక్షేమం దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పటికే మహిళలకు అమలు చేస్తున్న ‘మహాలక్ష్మి’ పథకాన్ని దివ్యాంగులకు కూడా వర్తింపజేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందని ఓ సర్క్యులర్ వైరల్ అవుతూ ఉంది. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రాష్ట్ర సరిహద్దుల వరకు ఉచితంగా ప్రయాణించవచ్చని ఆ పోస్టుల్లో తెలిపారు.
వైరల్ అవుతున్న కథనాల్లో "దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు గ్యారెంటీల్లో భాగంగా మాలక్ష్మి పథకం కింద మహిళలలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం ఇప్పటికే అమలు చేస్తుండగా తాజాగా రాష్ట్రంలోని దివ్యాంగ పురుషులకూ వంద శాతం ఫ్రీ బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రస్తుతం ఉచిత బస్సు ప్రయాణం తెలంగాణ రాష్ట్రానికి చెందిన బాలికలు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు వర్తింపచేస్తున్నారు. వీరు రాష్ట్రంలోని పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులలో తెలంగాణ సరిహద్దుల లోపు ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. అంతర్రాష్ట్ర పల్లె వెలుగు మరియు ఎక్స్‌ప్రెస్ బస్సులలో తెలంగాణ సరిహద్దు వరకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారంటూ కథనాలు వైరల్ అయ్యాయి.
పలు మీడియా కథనాలకు సంబంధించిన ఆర్కైవ్ లింక్స్ ను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
వైరల్ స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.
వైరల్ అవుతున్న వాదనలో నిజానిజాలు తెలుసుకోవడం కోసం తెలుగుపోస్ట్ ఫ్యాక్ట్ చెక్ టీమ్ తెలంగాణ ఆర్టీసీ అధికారులను సంప్రదించింది. అయితే ప్రభుత్వం అలాంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదని అధికారులు తెలిపారు.
తెలంగాణ ఆర్టీసీకి సంబంధించిన వెబ్సైట్ ను కూడా పరిశీలించాం. అక్కడ ఎలాంటి ప్రకటన మాకు లభించలేదు.
https://www.tgsrtc.telangana.gov.in/
ఇక తెలంగాణ ఆర్టీసీ సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించగా, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదంటూ పోస్టులు పెట్టారు.
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.
వైరల్ అవుతున్న వాదనలో నిజానిజాలు తెలుసుకోవడం కోసం తెలుగుపోస్ట్ ఫ్యాక్ట్ చెక్ టీమ్ తెలంగాణ ఆర్టీసీ అధికారులను సంప్రదించింది. అయితే ప్రభుత్వం అలాంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదని అధికారులు తెలిపారు.
తెలంగాణ ఆర్టీసీకి సంబంధించిన వెబ్సైట్ ను కూడా పరిశీలించాం. అక్కడ ఎలాంటి ప్రకటన మాకు లభించలేదు.
https://www.tgsrtc.telangana.
ఇక తెలంగాణ ఆర్టీసీ సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించగా, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదంటూ పోస్టులు పెట్టారు.
ఇటీవల వివిధ సోషల్ మీడియాలో టీజీఎస్ ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు సంబంధించి వస్తున్న వార్తలపై టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం స్పష్టత ఇచ్చింది. దివ్యాంగులందరికీ బస్సుల్లో పూర్తిగా ఉచిత ప్రయాణం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి కొత్త ఉత్తర్వులు జారీ చేయలేదని, సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్త పూర్తిగా అవాస్తవమని తెలుపుతున్నాము. ఇలాంటి తప్పుడు వార్తలను సోషల్ మీడియాలో ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే వారిపై కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తుంది. ప్రజలు ఇటువంటి పుకార్లను నమ్మవద్దని, ఏదైనా కొత్త నిర్ణయం తీసుకుంటే పత్రికా ప్రకటన ద్వారా లేదా అధికారిక టీజీఎస్ ఆర్టీసీ వెబ్సైట్ ద్వారా గాని వెల్లడించడం జరుగుతుందని స్పష్టం చేస్తున్నామని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది.
ఇక వైరల్ అవుతున్న వాదనను ఖండిస్తూ పలు మీడియా సంస్థలు కూడా కథనాలను ప్రచురించాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
"ఉచిత బస్సు ప్రయాణం విషయంలో ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులందరికీ బస్సుల్లో పూర్తిగా ఉచిత ప్రయాణం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ మేరకు కొత్త ఉత్తర్వులు జారీ చేసిందని వార్తలు వచ్చాయి. దీనిపై టీజీఎస్ ఆర్టీసీ ఒక క్లారిటీ ఇచ్చింది. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం అంతా ఫెక్ అని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్త పూర్తిగా అవాస్తవమని వివరించింది. ఇలాంటి తప్పుడు వార్తలను సోషల్ మీడియాలో ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే వారిపై కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది." అంటూ మీడియా కథనాల్లో తెలిపారు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు
Claimed By : Social Media Users and Media Outlets
Fact Check : Unknown