ఫ్యాక్ట్ చెక్: ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీ నుండి ఇరాన్ మీదుగా ఎగరలేదు

ఢిల్లీ-ఫ్రాంక్‌ఫర్ట్ మధ్య ఎయిర్ ఇండియా విమానం ఇరాన్ మీదుగా

Update: 2026-03-09 03:18 GMT

ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం టెహ్రాన్‌పై వైమానిక దాడులను ప్రారంభించిన తర్వాత ఇజ్రాయెల్, ఇరాన్ తమ ఎయిర్ స్పేస్ ను మూసివేసాయి. భద్రతా కారణాల తర్వాత ఎయిర్ స్పేస్ ను మూసివేసిందని, విమానాశ్రయాలకు దూరంగా ఉండాలని పౌరులను కోరిందని ఇజ్రాయెల్ రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది.


అమెరికా సహాయంతో ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడి ప్రారంభించింది. ఈ దాడుల తర్వాత ఇరాన్ ప్రభుత్వం కూడా తన ఎయిర్ స్పేస్ ను మూసివేసిందని పలు నివేదికలు తెలిపాయి. ఇస్లామిక్ రిపబ్లిక్‌పై అమెరికా దాడులు జరుగుతూ ఉన్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత ఎక్కువగా ఉన్నాయి. దౌత్యానికి తలుపులు తెరిచి ఉన్నాయని అమెరికా చెప్పినప్పటికీ, ఇరాన్ లోని పలు ప్రాంతాలపై ఎయిర్ స్ట్రైక్స్ జరుగుతూ ఉన్నాయి.

జర్మన్ ఏవియేషన్ గ్రూప్ లుఫ్తాన్స ఏప్రిల్ నెల చివరి వరకు టెహ్రాన్‌కు విమానాలను నిలిపివేసింది, అదే సమయంలో మధ్యప్రాచ్యంలోని అనేక ప్రధాన గమ్యస్థానాలకు కూడా తన విమానాల సస్పెన్షన్‌ను పొడిగించింది. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఎయిర్‌లైన్స్ అలాంటి నిర్ణయం తీసుకుంది. దుబాయ్, అబుదాబితో సహా ప్రధాన గమ్యస్థానాలకు విమానాల సస్పెన్షన్ కొనసాగుతోంది. ప్రాంతీయ భద్రతా పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని లుఫ్తాన్స సంస్థ తెలిపింది. ఇలాంటి నిర్ణయాన్నే పలు ఎయిర్ లైన్స్ అమలు చేస్తూ ఉన్నాయి.

ఇరాన్ గగనతలంలో ఎయిర్ ఇండియా విమానం వెళ్ళిందంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న సాయుధ పోరాటం మధ్య, ఇరాన్ గగనతలంలో ఒకే ఒక్క విమానం ఉండగా, ఇతర విమానాలు దేశం చుట్టూ ఎగురుతున్నట్లు చూపించే చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఫ్రాంక్‌ఫర్ట్‌కు వెళ్లే ఎయిర్ ఇండియా విమానం AI 2030 ఇరానియన్ గగనతలంలో ప్రయాణించిందని, అలా చేసిన ఏకైక విమానం అదేనని నెటిజన్లు పేర్కొన్నారు.


https://x.com/Indiainfacts1/status/2029125872666714440

https://www.instagram.com/indianewsinsta/p/DVdtcRBDy_j/

వైరల్ పోస్టుకు సంబంధించిన ఆర్కైవ్ లింక్స్ ను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు

వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇక్కడ ఉంది



 

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.


ఫిబ్రవరి 28 నుండి ఇరాన్ గగనతలం మూసి వేశారు. ఢిల్లీ నుండి ఫ్రాంక్ ఫర్ట్ ఎగురుతున్న ఎయిర్ ఇండియా విమానం AI2030 వివరాల కోసం మేము వెతికాము. మార్చి 1న విమానం రద్దు చేసినట్లుగా కనుగొన్నాం.



 



https://www.flightaware.com/live/flight/AIC2030

ఫ్లైట్ వెళుతున్న దారిని కూడా మనం చూడొచ్చు



 



మరికొన్ని పోస్టుల్లో Air India 121 విమానం గురించి కూడా ఇదే తరహా వాదనతో వైరల్ చేశారు. అందులో కూడా ఎలాంటి నిజం లేదని ఫ్లైట్ ట్రావెల్ హిస్టరీని చూసి స్పష్టం చేశాం.

https://www.flightaware.com/live/flight/AIC121

ఈ వైరల్ పోస్టులపై ఎయిర్ ఇండియా స్పందించింది. వాటిని "తప్పు" అని పేర్కొంది. ఇది "వాస్తవ విమాన కార్యకలాపాలు లేదా భద్రతా ప్రోటోకాల్‌లను ప్రతిబింబించడం లేదు" అని తెలిపింది. "ఎయిర్ ఇండియా ఆంక్షలు విధించిన గగనతలంపై విమానాలను నడపదు" అని ఎయిర్‌లైన్స్ స్పష్టం చేసింది.

“మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ ఎయిర్ ఇండియా పరిమిత గగనతలంపై ప్రయాణించింది. సోషల్ మీడియాలో వ్యాపించే ఈ వాదనలు తప్పు. మా వాస్తవ విమాన కార్యకలాపాలు లేదా భద్రతా ప్రోటోకాల్‌లను ప్రతిబింబించవు.
వాస్తవ సమాచారం - ఎయిర్ ఇండియా ఎటువంటి పరిమిత గగనతలంపై విమానాలను నడపదు.
ప్రతి ప్రయాణం సురక్షితంగా, అనుకూలంగా,నమ్మదగినదిగా ఉండేలా చూసుకోవడానికి రియల్ టైమ్ ఇంటెలిజెన్స్, గ్లోబల్ అడ్వైజరీలు, నిరంతర పర్యవేక్షణను ఉపయోగించి విమాన మార్గాలను ప్లాన్ చేస్తారు. ఈ కార్యాచరణ నిర్ణయాలు అన్నింటికంటే ప్రయాణీకులు, సిబ్బంది భద్రత, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడంలో ఎయిర్ ఇండియా దృఢ నిబద్ధతను తెలియజేన్నాయి." అంటూ ఎక్స్ లో వివరించింది.



కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీ నుండి ఇరాన్ మీదుగా ఎగరలేదు.


Claim :  వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని ఎయిర్ ఇండియా తెలిపింది
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News