ఫ్యాక్ట్ చెక్: వైరల్ వీడియో శ్రీ రామ నవమి రోజున జరిగిన ర్యాలీ చూపుతోంది, ఇది బజరంగ్ దల్ ర్యాలీ కాదు

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో కొత్త వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో ముగ్గురు మరణించగా, పోలీసులు 150

Update: 2025-04-21 09:20 GMT

Bajrang dal procession 

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో కొత్త వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో ముగ్గురు మరణించగా, పోలీసులు 150 మంది నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. ఆ ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో భద్రతా బలగాలను మోహరించాల్సి వచ్చింది. హిందువుల ఇళ్లను కొందరు ధ్వంసం చేయడంతో వారు మాల్డాలోని సహాయ శిబిరాల్లో తలదాచుకోవాల్సి వచ్చింది. గత వారం అల్లర్లతో అట్టుడికిన ముర్షిదాబాద్ నుండి పారిపోయి మాల్డాలోని బైష్ణబ్‌నగర్‌లోని పాఠశాలలో తలదాచుకున్న దాదాపు 300 కుటుంబాలు ఏప్రిల్ 20, 2025న తిరిగి స్వస్థలాలకు చేరుకున్నాయి.

వందలాది మంది హిందువులు కాషాయ జెండాలతో ఒక వీధిలో ర్యాలీ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముర్షిదాబాద్‌లో అల్లర్లు జరిగిన తర్వాత భజరంగ్ దళ్ సభ్యులు పశ్చిమ బెంగాల్‌కు చేరుకుని తమ సత్తా చాటారంటూ ఈ వీడియోని చాలామంది షేర్ చేసారు. ఈ వీడియోను X లో "బజరంగ్ దళ్ బెంగాల్ చేరుకుంది. ఇక జిహాదీల వ్యవస్థ హాంగ్ అవుతుంది. జై శ్రీరామ్" అంటూ షేర్ చేయడం మనం చూడొచ్చు.


క్లెయిం ఆర్కైవ్  లింక్ ను ఇక్కడ చూడొచ్చు.

ఫ్యాక్ట్ చెక్:

ఈ వాదన తప్పుదోవ పట్టిస్తోంది. వైరల్ వీడియో శ్రీరామ నవమి రోజున జరిగిన ఊరేగింపును చూపుతోంది.

వైరల్ వీడియోలోని ముఖ్యమైన కీఫ్రేమ్‌లను తీసుకొని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఉపయోగించి వెతికినప్పుడు, ఆ వీడియోను కొంతమంది ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు షేర్ చేసినట్టు మాకు తెలిసింది.

హ్యాష్‌ట్యాగ్‌ కోల్‌కతా అనే ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారుడు ఏప్రిల్ 10, 2025న ఇదే వీడియోను బెంగాలీ క్యాప్షన్ తో పంచుకున్నారు. Bengali ” অভূতপূর্ব... অতুলনীয়...শিহরণ জাগানো মুহুর্তের সাক্ষী আজ গোটা বারাসাত...রামনবমীতে বাংলার অন্যতম বৃহৎ শোভাযাত্রায় কানায় কানায় পূর্ণ আজ বারাসাত রাজপথ... হর্ষে উল্লাসে লক্ষাধিক মানুষের জয় শ্রীরাম...হর হর মহাদেব ধবনিতে মুখরিত হয়েছে...।।“ దానిని అనువదించగా "అద్భుతం, సాటిలేనిది, ఈరోజు యావత్ బారసత్ పులకించిపోయే క్షణానికి సాక్ష్యమిచ్చింది. రామ నవమి సందర్భంగా బెంగాల్‌లో అతిపెద్ద శోభాయాత్రల్లో ఒకటిగా బారసత్ రోడ్లు కిక్కిరిసిపోయాయి. లక్షలాది మంది ప్రజలు శ్రీరాముని విజయాన్ని ఆనందోత్సాహాలతో జై శ్రీరామ్. హర్ హర్ మహాదేవ్ నినాదాలతో ప్రతిధ్వనించారు"

మరో ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారుడు ఇదే వీడియోను ఏప్రిల్ 6, 2025న బెంగాలీ క్యాప్షన్ తో షేర్ చేసారు. అది ఇలా ఉంది"“অভূতপূর্ব... অতুলনীয়...শিহরণ জাগানো মুহুর্তের সাক্ষী আজ গোটা বারাসাত...রামনবমীতে বাংলার অন্যতম বৃহৎ শোভাযাত্রায় কানায় কানায় পূর্ণ আজ বারাসাত রাজপথ... হর্ষে উল্লাসে লক্ষাধিক মানুষের জয় শ্রীরাম...হর হর মহাদেব ধবনিতে মুখরিত হয়েছে...।।সকলকে রামনবমীর অনেক অনেক শুভেচ্ছা আর ভালোবাসা... ক্ষাত্রবলে শৌর্যে বীর্যে জেগে ওঠো সকল যুবক যুবতীরা”. తెలుగులోకి అనువదించగా "అద్భుతం, సాటిలేనిది, ఈరోజు యావత్ బారసత్ పులకించిపోయే క్షణానికి సాక్ష్యమిచ్చింది. రామ నవమి సందర్భంగా బెంగాల్‌లో అతిపెద్ద శోభాయాత్రల్లో ఒకటిగా బారసత్ రోడ్లు కిక్కిరిసిపోయాయి. లక్షలాది మంది ప్రజలు శ్రీరాముని విజయాన్ని ఆనందోత్సాహాలతో జై శ్రీరామ్. హర్ హర్ మహాదేవ్. రామ నవమి సందర్భంగా అందరికీ అనేక శుభాకాంక్షలు మరియు ప్రేమలు. క్షత్రియ పేరుతో ధైర్యంగా పరాక్రమంతో మేల్కొనండి, యువతీ యువకులందరూ."

పశ్చిమ బెంగాల్‌లో శ్రీరామ నవమి వేడుకలను చూపుతున్న మరికొన్ని వీడియోలు ఇక్కడ ఉన్నాయి.

Full View

డెక్కన్ హెరాల్డ్ ప్రచురించిన కథనం ప్రకారం, రామ నవమి వేడుకలు ఆదివారం ఉదయం పశ్చిమ బెంగాల్ అంతటా ఉత్సాహభరితమైన ఊరేగింపులు, 'జై శ్రీరామ్' నినాదాలతో ప్రారంభమయ్యాయి. భక్తులు వేడుకల్లో మమేకమయ్యారు. వేడుకల సమయంలో శాంతిభద్రతలు కాపాడేందుకు రాష్ట్రంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.కాషాయ జెండాలు, భక్తి పాటలు మరియు రామాయణంలోని సన్నివేశాలను వర్ణించే శకటాలు ఊరేగింపులకు మరింత శోభను చేకూర్చడంతో వీధుల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఒక్క కోల్‌కతాలోనే 60కి పైగా ర్యాలీలు నిర్వహించడంతో పోలీసులు 4,000 నుండి 5,000 మంది సిబ్బందిని మోహరించారు. డిప్యూటీ కమిషనర్ మరియు జాయింట్ కమిషనర్ హోదా కలిగిన సీనియర్ అధికారులు ర్యాలీ మార్గాల్లో భద్రతను పర్యవేక్షించే బాధ్యతను తీసుకున్నారు.

కాబట్టి, వైరల్ వీడియో ముర్షిదాబాద్ అల్లర్ల తర్వాత పశ్చిమ బెంగాల్‌లో భజరంగ్ దళ్ నిర్వహించిన ర్యాలీని చూపదు. ఇది ఏప్రిల్ 6, 2025న నిర్వహించిన శ్రీరామ నవమి వేడుకల శోభా యాత్రను చూపుతుంది. ఈ వాదన తప్పుదోవ పట్టిస్తోంది.

Claim :  ముర్షిదాబాద్ అల్లర్ల తర్వాత పశ్చిమ బెంగాల్‌లో భజరంగ్ దళ్ సభ్యులు ర్యాలీ తీస్తున్నట్లుగా వైరల్ వీడియో చూపిస్తోంది
Claimed By :  X (Twitter) users
Fact Check :  Unknown
Tags:    

Similar News