ఫ్యాక్ట్ చెక్: సద్గురు కౌగిలించుకున్న మహిళ ఆయన కుమార్తె రాధే జగ్గీ

మహాశివరాత్రి రోజు రాత్రి కోయంబత్తూరులోని ఈశా యోగా కేంద్రంలో జరిగిన మహాశివరాత్రి వేడుకలకు లక్షలాది మంది హాజరయ్యారు.

Update: 2025-03-01 11:07 GMT

Sadhguru with his daughter

మహాశివరాత్రి రోజు రాత్రి కోయంబత్తూరులోని ఈశా యోగా కేంద్రంలో జరిగిన మహాశివరాత్రి వేడుకలకు లక్షలాది మంది హాజరయ్యారు. శివరాత్రి రోజు ఇషా సెంటర్ లో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వేడుకల్లో పాల్గొని మాట్లాడుతూ మహాశివరాత్రి కేవలం పండుగ మాత్రమే కాదని, దానికి శాస్త్రోక్తమైన ప్రాముఖ్యత ఉందన్నారు. ఇషా సంస్థ 'సేవ్ సాయిల్' ఉద్యమం, జాతీయ స్థాయిలో సంస్కృతిని పరిరక్షించడంలో ఆ సంస్థ పాత్రను అమిత్ షా హైలైట్ చేశారు. యోగా పురాతనమైనప్పటికీ, అది నేటికీ మనతోనే ఉందని ఆయన అన్నారు. తమిళ సాహిత్యం, సంస్కృతి లేకుండా భారతదేశ చరిత్ర అసంపూర్ణమని, తమిళనాడు అనేక వారసత్వ దేవాలయాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలకు నిలయంగా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శివకుమార్ కూడా హాజరయ్యారు. ఇక ఇషా ఫౌండేషన్‌ పై వచ్చిన నేరారోపణలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విచారణలో ముగ్గురు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP)లు భాగంగా ఉన్నారు, వారు విస్తృతమైన సోదాలను కూడా చేపట్టారు. పోలీసుల బృందం పర్యటనపై ఈషా యోగా కేంద్రం స్పందిస్తూ, పోలీసుల సోదాలు సాధారణ విచారణలో భాగమని పేర్కొంటూ ఒక ప్రకటన విడుదల చేసింది.

ఇదిలా ఉండగా, మహాశివరాత్రి వేడుకల్లో సద్గురు జగ్గీ వాసుదేవ్ ఒక మహిళతో కలిసి ఇషా యోగా కేంద్రంలో నృత్యం చేస్తున్న వీడియో వైరల్ అయింది. హిందీలో విభిన్నమైన కించపరిచే శీర్షికలతో వైరల్‌గా షేర్ చేస్తున్నారు. ఈ పోస్ట్‌లన్నీ వారి మధ్య అనుచిత సంబంధాన్ని సూచిస్తున్నాయి.

వైరల్ పోస్టుకు సంబంధించిన ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.

ఫ్యాక్ట్ చెక్:

వైరల్ అవుతున్న వాదనలో నిజం లేదు. ఈ వీడియోలో సద్గురు జగ్గీ వాసుదేవ్ తన సొంత కూతురు రాధే జగ్గీతో కలిసి డ్యాన్స్ చేశారు.
మేము వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించి, వాటిని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి సెర్చ్ చేసినప్పుడు, సద్గురు దర్శన్ అనే యూట్యూబ్ ఛానెల్‌లో “Sadhguru EMOTIONAL DANCE with DAUGHTER | Golden Moments | Radhe Jaggi | MahaShivRatri 2025” అనే టైటిల్ తో వీడియోను అప్లోడ్ చేసినట్లు తెలుస్తోంది. వీడియో వివరణలో “ఇషా యోగా సెంటర్‌లో మహాశివరాత్రి 2025 వేడుకల సందర్భంగా సద్గురు తన కుమార్తె రాధే జగ్గీతో కలిసి నృత్యాన్ని చేశారు. ఇది వారికి భావోద్వేగ క్షణాలు.” అని ఉంది.
Full View
ఇదే వీడియోను సద్గురు ఇన్‌స్టాగ్రామ్‌లో రాధే జగ్గీని ట్యాగ్ చేస్తూ 'Sadhguru & Radhe Share an Emotional Moment' అనే శీర్షికతో పోస్ట్ పెట్టారు.
జగ్గీ వాసుదేవ్‌తో పాటు అతని కుమార్తె రాధే జగ్గీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అనేక చిత్రాలను పంచుకున్నారని కూడా మేము కనుగొన్నాము. రాధే జగ్గీ తన తండ్రి గురించి, అనుబంధం గురించి మాట్లాడుతున్న వీడియో ఇక్కడ ఉంది
Full View

ఇండియా.కామ్ లో మహాశివరాత్రి సందర్భంగా ప్రచురించిన వీడియో లో కూడా ఆమె తన తండ్రి గురించీ మాట్లడటం మనం చూడొచ్చు. భారతదేశంలోని అత్యంత ప్రఖ్యాత సాధువు కుమార్తెగా తన జీవితం గురించి మాట్లాడారు, శివుడు, రావణుడి కథను కూడా పఠించారు.ఆ కధనం ఈ లింకులో చూడొచ్చు. అందువల్ల, వైరల్ వీడియోలో ఇషా ఫౌండేషన్‌కు చెందిన సద్గురు తన సొంత కుమార్తెతో కలిసి డ్యాన్స్ చేస్తున్నారు. వైరల్ వాదనలో ఎలాంటి నిజం లేదు. 

Claim :  ఇషా సెంటర్‌లో మహాశివరాత్రి వేడుకల సందర్భంగా సద్గురు ఒక మహిళను హత్తుకుని నృత్యం చేశారు
Claimed By :  Twitter users
Fact Check :  Unknown
Tags:    

Similar News