ఫ్యాక్ట్ చెక్: కాలేజీ, పాఠశాల విద్యార్థులందరికీ ఉచితంగా స్కూటీలను అందించే పథకాన్ని కేంద్రం మొదలుపెట్టలేదు.
18 ఏళ్లలోపు పాఠశాల విద్యార్థులందరికీ ఉచితంగా స్కూటీలను అందించే కొత్త ప్రభుత్వ పథకాన్ని
సోషల్ మీడియాలో ప్రభుత్వం ఉచితంగా పలు పథకాలను అందిస్తూ ఉందంటూ పలు పోస్టులు వైరల్ అవుతూ ఉంటాయి. ప్రధాన మంత్రి ఫ్రీ స్కూటీ స్కీమ్ అంటూ పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
18 ఏళ్లలోపు పాఠశాల విద్యార్థులందరికీ ఉచితంగా స్కూటీలను అందించే కొత్త ప్రభుత్వ పథకాన్ని వివరిస్తూ ఒక వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలలో కొన్నింటిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఉన్నారు. ఇటీవల బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ కూటమి విజయం సాధించిన తర్వాత ఈ ఆఫర్ ను ప్రకటించినట్లు వీడియోలలో తెలిపారు.
అయితే ఈ పథకం ప్రయోజనాలను పొందడానికి కనీసం ఐదుగురితో వీడియోను షేర్ చేయాలని కొన్ని వీడియోలలో కోరారు. నిర్దిష్ట సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను ఫాలో అయ్యి, పేజీ వివరణలోని లింక్ ద్వారా వారి వివరాలను నమోదు చేయాలని సూచిస్తారు. వీడియోలు ఒకే విధమైన ఫార్మాట్‌ను అనుసరిస్తున్నట్లు మనం చూడొచ్చు. డేటా ఎంట్రీ కోసం పలు లింక్‌లు కూడా ఈ వీడియోల కింద ఉన్నాయి.
వైరల్ అవుతున్న పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేశాం. కేంద్ర ప్రభుత్వం అలాంటి పథకాన్ని అమలు చేసి ఉంటే అది తప్పకుండా వార్తల్లో నిలిచి ఉండేది.
ఇక మేము పలు ప్రభుత్వ వెబ్ సైట్లను కూడా నిశితంగా పరిశీలించాం. సంబంధిత ఉచిత పథకం గురించి వెతికాము. అయితే ఎక్కడా కూడా అలాంటి ప్రకటన ప్రభుత్వం నుండి రాలేదు.
కాలేజీ విద్యార్థులకు కానీ, పాఠశాల పిల్లలకు ఉచిత బైక్స్, విద్యుత్ సైకిళ్లను అందించే పథకాన్ని ప్రభుత్వం ప్రకటించలేదు. వీడియోలను చూసి నమ్మేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించిన దృశ్యాలను డిజిటల్‌గా ఎడిట్ చేశారు. ఈ ఫుటేజ్ ఆయన గతంలో చేసిన ప్రసంగం నుండి తీసుకున్నారు. ప్రధాని మోదీ బహిరంగంగా అలాంటి ప్రకటనలు చేయలేదు. ప్రేక్షకులను తప్పుదారి పట్టించడానికి ఆడియోను డిజిటల్‌గా జోడించారు.
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదంటూ PIB ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పష్టం చేసింది.
"कहीं आप भी ‘प्रधानमंत्री फ्री स्कूटी योजना’ के झांसे में तो नहीं आ गए?
सोशल मीडिया पर एक लेख में दावा किया जा रहा है कि सरकार ‘प्रधानमंत्री फ्री स्कूटी योजना’ के तहत छात्राओं को कॉलेज जाने के लिए मुफ्त स्कूटी दे रही है
#PIBFactCheck:
यह दावा #फर्जी है
केंद्र सरकार द्वारा ऐसी कोई 'फ्री स्कूटी योजना' नहीं चलाई जा रही है
केंद्र सरकार से जुड़ी सही और प्रामाणिक जानकारी के लिए केवल
@PIBFactCheck
या संबंधित मंत्रालय की आधिकारिक वेबसाइट पर जाएं" అంటూ పోస్టు పెట్టింది.
'ప్రధానమంత్రి ఫ్రీ స్కూటీ స్కీమ్' పేరుతో సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారం పూర్తిగా ఫేక్ అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కాలేజీ విద్యార్థినులకు ఉచిత స్కూటీలు ఇస్తారని వైరల్ అవుతున్న పోస్టులు ఫేక్ అని PIBFactCheck తేల్చింది. ప్రజలు ఇలాంటి మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం కోసం అధికారిక వెబ్సైట్లను మాత్రమే సందర్శించాలని పేర్కొంది.
పలు మీడియా సంస్థలు ఉచితంగా స్కూటీ అంటూ ప్రజలను మోసం చేసే కార్యక్రమం జరుగుతూ ఉందంటూ వివరించాయి. ఆ కథనాలను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
ఇలాంటి సైబర్ మోసాల బారిన పడి డబ్బులు, మీ సమాచారాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయని పథకాలను ఆశగా చూపించి పలు సైబర్ మోసాలు చేస్తూ ఉన్నారు.
భారతదేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా పాఠశాలకు వెళ్లే పిల్లలకు లేదా విద్యార్థులకు ఉచితంగా స్కూటీలను అందించడం లేదు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తమిళనాడుతో సహా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు ఉచితంగా సైకిళ్లను అందిస్తున్నాయి.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : 18 ఏళ్లలోపు పాఠశాల విద్యార్థులందరికీ ఉచితంగా స్కూటీలను అందించే కొత్త ప్రభుత్వ పథకాన్ని
Claimed By : Social Media Users
Fact Check : Unknown