ఫ్యాక్ట్ చెక్: లాలీ పాప్ తో దొంగ మనసు మార్చిన చిన్నారి అంటూ వైరల్ అవుతున్న వీడియో నటీనటులతో చిత్రీకరించారు

ఓ వ్యక్తి ముసుగు వేసుకుని వచ్చి షాపులో ఉన్నదంతా దోచుకుని వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు

Update: 2025-11-21 10:50 GMT

చిన్న పిల్లలు తమ అమాయకత్వంతో ఎవరి మనసునైనా మార్చేయగలరని నిరూపించే వీడియో అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతూ ఉంది. ఓ వ్యక్తి షాప్ లో కూర్చుని ఉండగా, అతడి పక్కనే ఓ చిన్నారి కూడా కూర్చుని ఉంటుంది. ఇంతలో ఓ వ్యక్తి ముసుగు వేసుకుని వచ్చి షాపులో ఉన్నదంతా దోచుకుని వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ చిన్నారి తన చేతుల్లో ఉన్న లాలీ పాప్ ను దొంగకు ఇవ్వడానికి ముందుకు వస్తుంది. అంతే దొంగ మనసు మారిపోతుంది. దోచుకున్నది తిరిగి ఇచ్చేస్తాడు. పాపకు ఆప్యాయంగా ముద్దు పెడతాడు. దొంగ వెళ్ళిపోగానే ఆ వ్యక్తి తన కుమార్తెని ఎత్తుకుంటాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో వైరల్ అవుతూ ఉంది.


"లాలీపాప్తో దొంగ మనసు మార్చిన చిన్నారి!
దుకాణంలో దొంగతనానికి వచ్చిన వ్యక్తిని ఒక చిన్నారి అమాయక చర్య పూర్తిగా మార్చింది. చోరీకి ప్రయత్నిస్తున్న దొంగను చూసిన ఆ చిన్నారి తన లాలీపాప్ను ఇవ్వడానికి చేయిచాచింది. చిన్నారి నిర్దోషి ప్రేమకు కదిలిపోయిన దొంగ దోచుకున్న డబ్బును వెనక్కి ఇచ్చి, ఆ అమ్మాయిని ముద్దాడి వెళ్లిపోయాడు
#ViralVideo
#InnocentChild
#HeartTouching
#Humanity
#Inspiring Story
#SocialMedia
#Goodness" అంటూ పోస్టులు పెట్టారు.




తెలుగు మీడియా సంస్థలకు సంబంధించిన సోషల్ మీడియా సైట్లలో కూడా ఇదే తరహా ప్రచారం జరిగింది. నిజంగా జరిగిన ఘటన అంటూ ప్రచారం చేస్తున్నారు.



Full View


"లాలీపాప్‌తో దొంగ మనసు మార్చిన అమాయక చిన్నారి
దుకాణంలో దొంగతనానికి వచ్చిన వ్యక్తిని ఒక చిన్నారి అమాయక చర్య పూర్తిగా మార్చింది. చోరీకి ప్రయత్నిస్తున్న దొంగను చూసిన ఆ చిన్నారి తన లాలీపాప్‌ను ఇవ్వడానికి చేయిచాచింది. చిన్నారి నిర్దోషి ప్రేమకు కదిలిపోయిన దొంగ దోచుకున్న డబ్బును వెనక్కి ఇచ్చి, ఆ అమ్మాయిని ముద్దాడి వెళ్లిపోయాడు. ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, చిన్నారి మనసు మృదువైన చర్య నెటిజన్లను కంటతడి పెట్టిస్తోంది.
#ViralVideo #InnocentChild #HeartTouching #Goodness #Humanity #SocialMediaViral #NewsUpdate #InspiringStory" అంటూ మరికొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

Full View


వైరల్ అవుతున్న పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు



 



ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ పోస్టులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి. ఇది నిజంగా చోటు చేసుకున్న ఘటన కాదు. స్క్రిప్టెడ్ వీడియో.

వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్ తీసుకుని మేము గూగుల్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాము, పాకిస్థాన్ కు చెందిన యూట్యూబ్ ఛానల్ Kamran Team Official లో 16 నవంబర్ 2025న వీడియోను పోస్టు చేసినట్లు గుర్తించాం.

ڈاکو کا دل پگھل گیا #shortsfeed #shortsviral #kamranteamofficial అనే టైటిల్ తో వీడియోను అప్లోడ్ చేశారు.

Full View


వీడియో వివరణలో " DESCRIPTION: This video is a staged video and the people appearing in it are actually drama characters (actors), and the weapons shown in this video are fake.
The purpose of this video is absolutely not to hurt anyone's feelings.
This video does not represent any person or any institution.
This video is only for entertainment purposes.
Thank you." అని ఉంది.

ఈ వీడియో స్క్రిప్ట్డ్ ద్వారా చిత్రీకరించిన వీడియో, ఇందులో కనిపించే వ్యక్తులు వాస్తవానికి నటులు, అంతేకాకుండా ఈ వీడియోలో చూపబడిన ఆయుధాలు నకిలీవని తెలిపారు. ఈ వీడియో ఉద్దేశ్యం ఎవరి మనోభావాలను దెబ్బతీయడం కాదు. ఈ వీడియో ఏ వ్యక్తిని లేదా ఏ సంస్థను సూచించదు. ఈ వీడియో వినోద ప్రయోజనాల కోసం మాత్రమే సృష్టించామని వివరించారు.

అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు



 ఇదే వీడియోను Kamran Team ఫేస్ బుక్ పేజీలో పోస్టు చేశారు.


Full View


ఈ పేజీలో పలు స్క్రిప్టెడ్ వీడియోలు ఉన్నాయని మేము గమనించాం. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు.



 

కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. నటీనటులతో చిత్రీకరించిన వీడియోను నిజంగా చోటు చేసుకున్నదిగా ప్రచారం చేస్తున్నారు.


Claim :  లాలీ పాప్ తో దొంగ మనసు మార్చిన చిన్నారి. దోచుకున్న డబ్బును
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News