ఫ్యాక్ట్ చెక్: వైరల్ అవుతున్న వీడియో ఐబొమ్మ రవి లైవ్ లో జడ్జికి వివరణ ఇస్తున్న నిజమైన వీడియో కాదు

వైరల్ అవుతున్న వీడియో ఐబొమ్మ రవి సంబంధించింది అంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు

Update: 2025-11-26 04:16 GMT

ఐ బొమ్మ నిర్వాహకుడు రవిని మరోసారి కస్టడీకి తీసుకోవాలని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు భావిస్తున్నారు. నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. మరో ఏడు రోజుల కస్టడీని కోరారు. పోలీస్‌ కస్టడీపై కోర్టు తీర్పు రానుంది. ఇప్పటికే ఐదు రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు. దర్యాప్తు సంస్థల ప్రకారం, రవి దేశవ్యాప్తంగా ఏజెంట్ల నెట్‌వర్క్‌ను సృష్టించి, పైరసీ చిత్రాలను పంపిణీ చేయడానికి, ఆర్థిక మార్గాలను దాచడానికి విదేశీ సర్వర్‌లను, ఆఫ్‌షోర్ చెల్లింపు మార్గాలను ఉపయోగించాడు. డిజిటల్ పైరసీ నెట్‌వర్క్ ఐబొమ్మ ద్వారా అతను కోట్లు సంపాదించాడని అధికారులు అనుమానిస్తున్నారు.


ఈ నేపథ్యంలో, ఇన్‌స్టాగ్రామ్, ఇతర ప్లాట్‌ఫామ్‌లలో ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది. క్లిప్‌లో, ఐబొమ్మ రవి అని చెప్పుకునే వ్యక్తి కోర్టు గదిలో కూర్చుని, ల్యాప్‌టాప్‌లో టైప్ చేస్తూ న్యాయమూర్తికి 'హ్యాకింగ్ ప్రక్రియ' గురించి వివరిస్తున్నట్లు కనిపిస్తుంది. ఆ వ్యక్తి VR హెడ్‌సెట్ ధరించి ఉన్నట్లు కూడా చూడొచ్చు. ఇది రవికి సంబందించిన వీడియో అంటూ పలువురు సోషల్ మీడియా యూజర్లు పోస్టులు పెట్టారు.

"iBomma ఇమ్మడి రవి కోర్ట్‌లో VR హెడ్‌సెట్ పెట్టుకుని లైవ్‌గా హాకింగ్ డెమో చూపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రవి స్టాండ్‌లో నిలబడి, ల్యాప్‌టాప్‌లో టైప్ చేస్తూ, జడ్జి ముందు తన హ్యాక్ ప్రూఫ్‌ను చూపిస్తున్న దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. బయటి ఆడియెన్స్‌లోని ఫోన్ ఫుటేజ్ ద్వారా ఈ షాకింగ్ క్లిప్ సోషల్ మీడియాలో భారీగా షేర్ అవుతోంది." అంటూ కొందరు యూజర్లు పోస్టులు పెట్టారు.





వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు



 



ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ వీడియోను ఏఐ ద్వారా సృష్టించారు. నిజమైన వీడియో కాదు.

మేము వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. సంబంధిత వీడియోను అప్లోడ్ చేసినట్లుగా ఒక్క మీడియా నివేదిక కూడా లభించలేదు. ఐబొమ్మ రవికి సంబంధించిన పలు విషయాలను మీడియా సంస్థలు ఎప్పటికప్పుడు ప్రచురిస్తూ ఉన్నాయి. అయితే ఈ వీడియోకు సంబంధించిన ఎలాంటి ప్రస్తావన మీడియా సంస్థలు చేయలేదు.

ఇక ఐబొమ్మ రవి అరెస్టుకు సంబంధించిన వివరాలను పోలీసులు నవంబర్ 25న ప్రెస్ మీట్ లో వివరించారు. అయితే ఎక్కడా కూడా ఈ వీడియో గురించి ప్రస్తావించలేదు. లైవ్ స్ట్రీమింగ్ లింక్స్ ఇక్కడ ఉన్నాయి.

Full View



Full View



వైరల్ పోస్టుల్లోని కామెంట్స్ ను పరిశీలిస్తే పలువురు నెటిజన్లు ఈ వీడియో ఏఐ అంటూ కామెంట్లు చేశారు. సదరు వ్యక్తి ముందు ల్యాప్ టాప్ ఉండగా మళ్లీ VR హెడ్ సెట్ ఎందుకు వేసుకుంటాడని కూడా పలువురు ప్రశ్నించారు.



 వీడియో మొదటి ఫ్రేములో జడ్జి ముఖం వింతగా ఉండటం, డెమో ఇస్తున్న వ్యక్తి కాళ్లు అసలే కనపడకపోవడం వంటి కొన్ని తప్పులు స్పష్టంగా చూశాం. AI ఉపయోగించి ఈ వీడియోను సృష్టించవచ్చనే అనుమానాలు మాకు కలిగాయి. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు.




 అందులోని కీఫ్రేమ్‌లను ఉపయోగించి ఇంటర్నెట్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ వీడియో మాకు ‘prajayhoney’ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో లభించింది. దీన్ని తను 23 నవంబర్ 2025న అప్లోడ్ చేశాడు. అయితే ఈ వీడియో ఎక్కడి నుండి లభించిందంటూ సదరు అకౌంట్ హోల్డర్ ను సంప్రదించగా ఏఐ ద్వారా సృష్టించినట్లుగా మా ఫ్యాక్ట్ చెక్ టీమ్ కు వివరణ ఇచ్చారు.





ఇక తాను ఏఐ వీడియోను షేర్ చేశానని స్టోరీ కూడా పెట్టినట్లు మేము గుర్తించాం. ఆ స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు.



 



ఇక హైవ్ AI కంటెంట్ డిటెక్షన్ టూల్‌లో ఈ వీడియోని రన్ చేసి చూసాం. ఇది AI-జనరేట్ వీడియో అని తేల్చింది. అందుకు సంబంధించిన ఫలితాలను ఇక్కడ చూడొచ్చు.



 



ఇక ఫ్యాక్ట్ చెక్ సంస్థలు ఫ్యాక్ట్ లీ, న్యూస్ మీటర్ కూడా వైరల్ వీడియోను ఏఐ ద్వారా సృష్టించారంటూ నిర్ధారించాయి. అందుకు సంబంధించిన లింక్స్ ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.


కాబట్టి, వైరల్ అవుతున్న వీడియోను ఏఐ ద్వారా సృష్టించారని స్పష్టంగా తెలుస్తోంది. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.


Claim :  వైరల్ అవుతున్న వీడియో ఐబొమ్మ రవి.. ఈ వీడియోను ఏఐ ద్వారా సృష్టించారు
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News