ఫ్యాక్ట్ చెక్: ఉదయపూర్ ఫైల్స్ అనే సినిమాకు వ్యతిరేకంగా ప్రజలు చేసిన నిరసన ర్యాలీ ని వైరల్ వీడియో చూపిస్తోంది
దర్జీ కన్హయ్య లాల్ హత్య ఆధారంగా నిర్మించిన 'ఉదయపూర్ ఫైల్స్' సినిమా విడుదలపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. ఈ సినిమా
By - Satya Priya BNUpdate: 2025-07-14 14:18 GMT
దర్జీ కన్హయ్య లాల్ హత్య ఆధారంగా నిర్మించిన 'ఉదయపూర్ ఫైల్స్' సినిమా విడుదలపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. ఈ సినిమా జూలై 10, 2025న విడుదల కావాల్సి ఉంది. ఈ సినిమా CBFC (కేంద్రం మరియు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని పలువురు కోర్టులను ఆశ్రయించారు. సినిమాను పర్మనెంట్‌గా బ్యాన్ చేయాలని కోరుతూ కొందరు అభ్యరిస్తున్నారని, దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలని, అప్పటి వరకు ఉదయ్‌పూర్ ఫైల్స్ చిత్రాన్ని రిలీజ్ చేయకుండా స్టే ఇస్తున్నామని ఢిల్లీ హైకోర్టు జూలై 10వ తేదీన తీర్పును ఇచ్చింది. ఈ సినిమా ద్వేషపూరిత వాదనలను ప్రోత్సహిస్తుందని, ఒక కమ్యూనిటీని లక్ష్యంగా చేసుకుంటుందని, మత ఉద్రిక్తతలను ప్రేరేపించగలదని పిటీషన్ లో వాదించారు. ఇక సినిమా విడుదలపై నిషేధం విధించాలని కోరుతూ మౌలానా అర్షద్ మదాని పిటిషన్ దాఖలు చేశారు.
ముస్లిం సమాజం నిర్వహిస్తున్న భారీ నిరసనకు సంబంధించిన వీడియో, మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొడుతుందని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ప్రజలు ర్యాలీలో పాల్గొని నినాదాలు చేస్తున్నట్లు చూపిస్తుంది. వీడియో పైభాగంలో ‘ఉదయపూర్ ఫైల్స్‌ను బహిష్కరించాలి’ అనే టెక్స్ట్ జోడించారు.
వైరల్ పోస్టు ఆర్కైవ్ లింక్ ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న పోస్టులు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయి. వైరల్ వీడియో ఉదయపూర్ ఫైల్స్ సినిమాకి సంబంధించినది కాదు. ఇది ఏప్రిల్ 2025లో తమిళనాడులో జరిగిన ర్యాలీని చూపిస్తుంది.
వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించి, వీడియోలో కనిపించే బ్యానర్‌ను తనిఖీ చేసినప్పుడు తమిళ రాష్ట్రాలలో 'కృష్ణగిరి పట్టణంలో వక్ఫ్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని, బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన అని వ్రాసిన బ్యానర్‌ను మేము కనుగొన్నాము. వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్ తీసుకుని మేము రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాము. సోషల్ మీడియాలో పాత వీడియోలు ఉన్నాయని కనుగొన్నాము.
JS vlog అనే యూట్యూబ్ ఛానల్ లో ఏప్రిల్ 14, 2025న ‘Waqf bill protest, Rejected bill Krishnagiri district protest’ అనే టైటిల్ తో వీడియోను పోస్టు చేశారని మేము గుర్తించాం.
"Krishnagiri officials" అనే ఫేస్‌బుక్ పేజీ కూడా "
కృష్ణగిరిలో వక్ఫ్ బిల్లుపై నిరసన" అనే శీర్షికతో వైరల్ వీడియోను షేర్ చేసింది.
కృష్ణగిరి జిల్లా ఆల్ జమాత్, డిస్ట్రిక్ట్ ఉలేమాస్ ఫెడరేషన్ కృష్ణగిరిలో వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ భారీ నిరసన ప్రదర్శన నిర్వహించింది
వార్త నివేదికల ప్రకారం, కృష్ణగిరి జిల్లా ఆల్ జమాత్, డిస్ట్రిక్ట్ ఉలేమాస్ ఫెడరేషన్ కృష్ణగిరిలో వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ భారీ నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నాయకుడు ఖాదర్ మొయిదీన్ నేతృత్వంలో వేలాది మంది నిరసనకారులు వక్ఫ్ సవరణ బిల్లును ఆమోదించినందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ నిరసన గళాన్ని వినిపించారు. వేలాది మంది నిరసనకారులు ప్రతిపక్ష పార్టీలు, ముస్లిం సమాజం వ్యతిరేకిస్తున్నప్పటికీ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ఆమోదించినందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు.
కొన్ని
ఫ్యాక్ట్ చెక్ సంస్థలు ఈ వాదనను తోసిపుచ్చాయి. వైరల్ వీడియో ఉదయపూర్ ఫైల్స్ సినిమాకు సంబంధించినది కాదని తేల్చాయి.
కాబట్టి, వైరల్ వీడియో త్వరలో విడుదల కానున్న ‘ఉదయపూర్ ఫైల్స్’ కి సంబంధించినది కాదు. ఏప్రిల్ 2025 లో వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లిం సంఘాల నిరసనను చూపిస్తుంది. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది.
Claim : త్వరలో విడుదల కానున్న ఉదయపూర్ ఫైల్స్ సినిమాకు వ్యతిరేకంగా ప్రజలు నిరసన తెలుపుతున్నారు
Claimed By : Social media users
Fact Check : Unknown