ఫ్యాక్ట్ చెక్: హలాల్ జ్యూస్ అంటూ వైరల్ అవుతున్న వీడియో ప్రాంక్ లో భాగం

హలాల్ అనేది అరబిక్ పదం. ఆహారం విషయంలో, హలాల్ అంటే ఇస్లామిక్ చట్టం ప్రకారం ముస్లింలు తినడానికి అనుమతించబడిన ఆహారం, పానీయ

Update: 2025-03-19 11:52 GMT

Halal juice

హలాల్ అనేది అరబిక్ పదం. ఆహారం విషయంలో, హలాల్ అంటే ఇస్లామిక్ చట్టం ప్రకారం ముస్లింలు తినడానికి అనుమతించబడిన ఆహారం, పానీయాలు. అయితే ఆహారంలో ఉమ్మివేయడం హలాల్ అవుతుందని చాలా మంది నమ్ముతారు. తినేపదార్థాలలోనూ, పానీయాలలోనూ ఉమ్మివేయడాన్ని చూపించే అనేక వీడియోలు సోషల్ మీడియాలో వివిధ శీర్షికలతో వైరల్ అవుతూ ఉన్నాయి. 

ఒక పండ్ల విక్రేత కస్టమర్ ముందు పండ్ల రసంలో ఉమ్మివేయడం, కస్టమర్ చేత తిట్టించుకోవడం చూపించే వీడియో సోషల్ మీడియాలో, ముఖ్యంగా వాట్సాప్‌లో తెలుగు క్యాప్షన్‌తో షేర్ అవుతోంది. “*హలాల్ పేరు తో జ్యూస్ ముస్లిం ఎంగిలి చేసి *HALAL Juice * ఇస్తుంటే రియాక్షన్ మన దేశం లో కాదు. మన దేశం లో అయితే " సెక్యులరిజం ప్రమాదం లో " అని జిహాదీల బానిసలు రచ్చ రచ్చ చేసే వాళ్ళు.* *HALAL Juice*” అంటూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
Full View
ఆ వీడియో అదే క్యాప్షన్‌తో వాట్సాప్‌లో సర్క్యులేట్ అవుతోంది.
వైరల్ వీడియో 2024 లో కూడా వైరల్ అయింది

వైరల్ పోస్టుకు సంబందించిన ఆర్కైవ్ లింక్ ను చూడొచ్చు.

ఫ్యాక్ట్ చెక్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వీడియోలో ముస్లిం వ్యక్తి రసంలో ఉమ్మివేయడం కనిపించడం లేదు. ఇది ఒక ప్రాంక్ వీడియో.

వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను మేము సంగ్రహించినప్పుడు, ఈ కీఫ్రేమ్‌లపై అరబిక్ టెక్స్ట్ కనిపించింది. మేము గూగుల్ లెన్స్‌ని ఉపయోగించి టెక్స్ట్‌ను ఆంగ్లంలోకి అనువదించినప్పుడు అది ‘Thaer Abu Zubaida’s prank at the Islamic University’ అని సూచించింది. దీన్ని బట్టి ఇదొక ప్రాంక్ వీడియో అని తెలుస్తోంది. @mahmood.246 అని ట్యాగ్ చేసిన వీడియోలో TikTok వాటర్‌మార్క్ కూడా కనిపిస్తుంది. స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు.
ఆ వీడియో సఫావత్ ముస్తఫా దహిర్ అనే అరబిక్ యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేశారని కూడా మేము కనుగొన్నాము. ఈ వీడియో టైటిల్ ద్వారా ఇది ఒక ప్రాంక్ వీడియో అని తెలుస్తోంది.
Full View
Thaer Abu Zubeida కు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాల గురించి మేము వెతికాం. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ హ్యాండిల్స్ తో పాటూ థేర్ జుబిడా అనే యూట్యూబ్ ఛానెల్‌ను కూడా కనుగొన్నాము. ఆ ఛానెల్ వివరణలో అతను “థియేటర్, సినిమా ఆర్టిస్ట్, హిడెన్ కెమెరా ప్రెజెంటర్” అని పేర్కొంది.

ఈ హ్యాండిల్స్‌లో ఏ ఒక్కదానిలోనూ వైరల్ వీడియో కనిపించనప్పటికీ, పండ్ల రసం విక్రేతగా నటించిన వ్యక్తి, ఇతర వీడియోల లోని వ్యక్తి ఒకరేనని మేము కనుగొన్నాము. మేము టిక్‌టాక్ వీడియో కోసం శోధించినప్పుడు, వైరల్ వీడియో పొడవైన వెర్షన్‌ను చూపించే ఆర్కైవ్ చేసిన వీడియో మాకు కనిపించింది. 1.47 వీడియోలో కస్టమర్ ఇది ఒక ప్రాంక్ వీడియో అని గ్రహించి, తిరిగి వచ్చి దుకాణ విక్రేత థేర్ అబు జ్బెడాను కౌగిలించుకున్నట్లు చూపిస్తుంది. చుట్టూ ఉన్న వ్యక్తులు చప్పట్లు కొడుతూ, ఉత్సాహపరిచారు.

అసలు ప్రాంక్ వీడియో ఇక్కడ చూడొచ్చు.



వీడియోకు సంబంధించి నిడివి ఎక్కువ ఉన్న వెర్షన్ ఇక్కడ ఉంది. ఇందులో మనం దుకాణదారుడితో జ్యూస్ కొనడానికి వచ్చిన వ్యక్తి నవ్వుతూ మాట్లాడడం, వీడియోలో ఉన్న మిగితా వారు కూడా నువ్వుటూ చూస్తుండడం మనం గమనించవచ్చు. కాబట్టి, జ్యుస్ అమ్మే వ్యక్తి ఉమ్మేస్తున్నట్లు చూపించే వీడియో ఒక ప్రాంక్ వీడియో. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

Claim :  హలాల్ పేరుతో తాజా పండ్ల రసంలో దుకాణదారుడు ఎంగిలి చేస్తున్నాడు
Claimed By :  Social media users
Fact Check :  Unknown
Tags:    

Similar News