ఫ్యాక్ట్ చెక్: చైన్ స్నాచింగ్‌ కు సంబంధించిన వైరల్ వీడియోలో ఉన్నది వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు కాదు

మహిళ మెడలో గొలుసు లాక్కుని పారిపోతున్న వ్యక్తి వైఎస్సార్‌సీపీ సభ్యుడిగా పేర్కొంటూ ఓ వీడియోను వైరల్ చేస్తున్నారు. ఓ యువకుడు వీధిలో వెళ్తున్న ఓ మహిళ నుంచి గొలుసు లాక్కున్న దృశ్యం ట్విటర్‌లో వైరల్‌గా మారింది.

Update: 2024-02-07 05:24 GMT

chain

మహిళ మెడలో గొలుసు లాక్కుని పారిపోతున్న వ్యక్తి వైఎస్సార్‌సీపీ సభ్యుడిగా పేర్కొంటూ ఓ వీడియోను వైరల్ చేస్తున్నారు. ఓ యువకుడు వీధిలో వెళ్తున్న ఓ మహిళ నుంచి గొలుసు లాక్కున్న దృశ్యం ట్విటర్‌లో వైరల్‌గా మారింది.

“ఆడవారి మెడలో గొలుసులు కొట్టేసే @YSRCParty దొంగలు. ఆదమరిస్తే మీ మెడలో గొలుసులతో పాటు మీ ఒంటిమీద బట్టలు కూడా కొట్టేస్తారు అని మరోసారి ప్రూవ్ అయ్యింది. రాజకీయాల్లోకి రాకముందు నాన్న చదువుకోమని పంపిస్తే ఇలా మెడలో గొలుసులు కొట్టేసిన అనుభవ పాఠాలు చెప్పావా . @ysjagan‌.? #EndOfYsrcp” అనే వాదనతో పోస్టులు పెడుతున్నారు.


ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వీడియో ఫిబ్రవరి 2018 నాటిది. చెన్నైలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన CCTV ఫుటేజీ ఇది.

వైరల్ వీడియోకు సంబంధించిన కీఫ్రేమ్స్ ను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. ఆ వీడియోను పలు యూట్యూబ్ ఛానల్స్ లో పోస్టు చేశారని మేము గుర్తించాం. “Chennai Chain snatching CCTV footage” అనే టైటిల్ తో వీడియోను అప్లోడ్ చేశారు.

''చెన్నైలోని కుండ్రత్తూర్ ప్రాంతంలో చైన్ స్నాచింగ్ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. కిరాణా షాప్ కు వెళ్లి తిరిగి వస్తున్న మహిళ మెడలో నుంచి ఒక వ్యక్తి గొలుసు లాక్కున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మహిళ కిందపడిపోవడంతో చైన్ స్నాచర్ తన సహచరుడితో కలిసి బైక్‌పై పరారయ్యాడు. వీరిద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులు మహిళను అనుసరించి.. పట్టపగలు ఆమె నుండి చైన్ ను లాక్కుని వెళ్లిపోయారు. నిందితులను వీలైనంత త్వరగా పట్టుకుంటామని పోలీసులు బాధితురాలికి హామీ ఇచ్చారు." అని వీడియో కింద వివరణలో ఉంది.

Full View

చెన్నైలో చైన్ స్నాచింగ్ దొంగలకు సంబంధించిన CCTV ఫుటేజీని అప్లోడ్ చేసింది TNIE. ఆ ఛానల్ యూట్యూబ్ వీడియోలలో కూడా దీన్ని షేర్ చేశారు.

Full View

చెన్నైలో ఎక్కువవుతూ ఉన్న చైన్-స్నాచింగ్ కేసులను చర్చిస్తూ వెబ్ దునియా తమిళ ఎడిషన్ ప్రచురించిన కథనంలో కూడా స్క్రీన్ షాట్ ను చూడొచ్చు. చెన్నై లోని ఓ వీధిలో వెళ్తున్న జయశ్రీ అనే మహిళపై ఓ వ్యక్తి దాడి చేసి గొలుసును లాక్కెళ్లాడని కథనంలో వివరించారు.

న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వైరల్ వీడియోకు సంబంధించి ఎక్కువ నిడివి ఉన్న వీడియో వెర్షన్‌ను అప్లోడ్ చేసింది.

కాబట్టి, వైరల్ వీడియో ఆంధ్రప్రదేశ్‌కి చెందినది కాదు. వైసీపీ నేత ఒక మహిళ నుండి గొలుసు లాక్కున్నట్లు చెబుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఇది చెన్నై నగరంలో చోటు చేసుకున్నది. అది కూడా పాతది. వైరల్ అవుతున్నది ప్రజలను తప్పుదోవ పట్టించే కథనాలు.
Claim :  Video shows YSRCP party member snatching chains from a woman’s neck
Claimed By :  Twitter users
Fact Check :  False
Tags:    

Similar News