ఫ్యాక్ట్ చెక్: బీఎల్‌ఏ నాయకులు హెచ్చరిక జారీ చేస్తున్న వైరల్ వీడియో పాతది, మే 2019 నుండి ఆన్‌లైన్‌లో ఉంది

భారత సైనిక దళాలు మే 7 2025న పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని 9 ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసి అనేక మంది ఉగ్రవాద

Update: 2025-05-09 08:01 GMT

BLA leaders

భారత సైనిక దళాలు మే 7, 2025న పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని 9 ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసి అనేక మంది ఉగ్రవాదులను హతమార్చాయి. దీని తరువాత, బలూచిస్తాన్‌లోని కచ్చి జిల్లాలో సైనిక కాన్వాయ్‌ని లక్ష్యంగా చేసుకుని జరిగిన శక్తివంతమైన ఐఈడీ పేలుడులో ఇద్దరు సీనియర్ అధికారులతో సహా కనీసం 12 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు. భద్రతా చర్యల కోసం వెళుతున్న యూనిట్‌ పైన ఈ దాడి చేసినట్లు సమాచారం, ఈ దాడికి బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) బాధ్యత వహించింది.

బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) పాకిస్తాన్‌లో ఉన్న బలూచిస్తాన్ లో పనిచేస్తున్న ఒక సమూహం, ఇది బలూచిస్తాన్‌ నుంచి పాకిస్తాన్ ను తొలగించేందుకు తిరుగుబాటు చేస్తోంది. ఈ సమూహం ఇటీవలి సంవత్సరాలలో అనేక దాడులు చేసింది.

ఇంతలో, ముసుగులు ధరించిన వ్యక్తులు కొండల్లో కూర్చుని ఉండి, వారిలో ఒక వ్యక్తి కెమెరాతో మాట్లాడుతున్న వీడియో కనిపిస్తుంది. వారి దాడి ఉద్దేశ్యం చాలా స్పష్టంగా ఉందని ఆ వ్యక్తి చెబుతున్నట్లు వినబడుతోంది: బలూచిస్తాన్ నుండి వెంటనే వైదొలగాలని చైనా, పాకిస్తాన్‌కు ఇది ఒక సందేశం. జనరల్ అస్లాం బలూచ్ కూడా ఈ హెచ్చరికను జారీ చేశారు. బలూచిస్తాన్‌ను పరిరక్షించడానికి ఈ చర్యలు చేపట్టారు. "బలూచ్ లిబరేషన్ ఆర్మీ చైనా, పాకిస్తాన్‌కు భయానకమైన హెచ్చరిక జారీ చేసింది: 'బ్రతకాలనుకుంటే బలూచిస్తాన్ నుండి వైదొలగండి'" అనే శీర్షికతో ఈ వీడియో ప్రచారంలో ఉంది.


క్లెయిమ్ ఆర్కైవ్ లింక్ ఇక్కడ ఉంది:

ఫ్యాక్ట్ చెక్:

ఈ క్లెయిమ్ తప్పుదారి పట్టిస్తోంది. ప్రచారంలో ఉన్న వీడియో ఇటీవలిది కాదు.

వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను సేకరించి, గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఉపయోగించి వాటిని శోధించినప్పుడు, ఆ వీడియో పాతదని, 2019లో పోస్ట్ చేయబడిందని మాకు తెలిసింది.

హృతీక్ టిడ్కే అనే వినియోగదారు షేర్ చేసిన ఒక ట్వీట్‌లో, వైరల్ అవుతున్న వీడియో మే 2019 నుండి అని పేర్కొన్నారు. మే 11, 2019న గ్వాదర్‌లోని పెర్ల్ కాంటినెంటల్ హోటల్‌పై వారి దాడి తర్వాత బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) దీన్ని విడుదల చేసింది. దీనికి ప్రస్తుత సంఘటనలతో ఎటువంటి సంబంధం లేదు.

పాకిస్తాన్-కెనడియన్ జర్నలిస్ట్ మరియు రచయిత తారెక్ ఫతే అదే వీడియోను మే 20, 2019న షేర్ చేస్తూ, ‘బలూచ్ లిబరేషన్ ఆర్మీ #బీఎల్‌ఏ చైనా అధ్యక్షుడు #జి జిన్‌పింగ్‌కు హెచ్చరిక జారీ చేసింది: "#బలూచిస్తాన్‌ను విడిచిపెట్టాల్సిన సమయం వచ్చేసింది, లేదా బలూచ్ పిల్లల నుండి ప్రతిస్పందనను చూస్తారు, వారు బలూచిస్తాన్‌ను మీ శ్మశాన వాటికగా మారుస్తారు.’ అంటూ షేర్ చేసారు.

షెహజాద్ హుస్సేన్ అనే ఎక్స్ యూజర్ మే 20, 2019న ఇదే వీడియోను షేర్ చేసారు. 


బలూచిస్తాన్లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) ఇటీవల విడుదల చేసిన ప్రకటనల గురించి మరింత పరిశోధన చేయగా, పాకిస్తాన్ దళాలు జరిపిన డ్రోన్ దాడులు, ఫిరంగి దాడులకు ప్రతీకారంగా బీఎల్‌ఏ పది మంది పాకిస్తాన్ బందీలను ఉరితీస్తామని బెదిరించినట్లు తెలిసింది. మార్చి 2025లో బలూచిస్తాన్‌లోని బోలన్ జిల్లాలో కొనసాగుతున్న బందీల పరిస్థితి మధ్య, ఇటీవల కాకుండా, బలవంతంగా అదృశ్యమైన కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ 48 గంటల గడువు కూడా విధించింది. అయితే, ఈ హెచ్చరిక 2025 మార్చ్ లొస్ విడుదల చేసినట్లు తెలుస్తోంది.

ఇటీవల బీఎల్‌ఏ విడుదల చేసిన వీడియోలో, బలూచిస్తాన్‌లోని కచ్చి జిల్లాలో జరిగిన ఐఈడీ దాడికి తామే బాధ్యులమని పేర్కొంది, దీనిలో స్పెషల్ ఆపరేషన్స్ కమాండర్‌తో సహా 14 మంది పాకిస్తాన్ ఆర్మీ సైనికులు మరణించారు. అంతేకాని, వైరల్ అవుతున్న వీడియో ఇటీవలది కాదు.

కనుక, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీతో పోరాడుతున్నప్పటికీ, పాకిస్తాన్ మరియు చైనాను హెచ్చరిస్తూ వారు ఒక వీడియోను విడుదల చేశారనే వాదనతో ప్రచారంలో ఉన్న వీడియో పాతది, 2019 నాటిది. ఈ క్లెయిమ్ తప్పుదారి పట్టిస్తోంది.

Claim :  వైరల్ వీడియో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రతినిధులు చైనా, పాకిస్తాన్‌ లను హెచ్చరించడం చూపిస్తోంది
Claimed By :  X (Twitter) users
Fact Check :  Unknown
Tags:    

Similar News