ఫ్యాక్ట్ చెక్: వైరల్ వీడియో చూపుతున్నది ఢిల్లీలో సంభవించిన భూకంపం విజువల్స్ కాదు

ఢిల్లీ-NCR లో ఫిబ్రవరి 17, 2025న రిక్టర్ స్కేల్‌పై 4.0 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఫిబ్రవరి 17న ఉదయం 5.36 గంటలకు ప్రకంపన

Update: 2025-02-17 07:11 GMT

ఢిల్లీ-NCR లో ఫిబ్రవరి 17, 2025న రిక్టర్ స్కేల్‌పై 4.0 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఫిబ్రవరి 17న ఉదయం 5.36 గంటలకు ప్రకంపనలు సంభవించాయి, అవి కొన్ని సెకన్ల పాటు కొనసాగాయి. దీంతో పలు ప్రాంతాల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. దక్షిణ ఢిల్లీలోని ధౌలా కువా లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ కాలేజ్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ సమీపంలో భూకంప కేంద్రం ఏర్పడినట్టు అధికారులు కనుగొన్నారు.

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో భూకంపం సంభవించినప్పుడు పెద్ద శబ్దం వినిపించిందని అధికారులు తెలిపారు. భూకంపం సమయంలో వచ్చిన శబ్దం భూకంపం లోతు తక్కువగా ఉండటం వల్ల సంభవించి ఉంది. ఇది టెక్టోనిక్ ప్లేట్లలో కదలిక, పలు పేలుళ్ల కారణంగా జరిగి ఉండవచ్చు. బలమైన ప్రకంపనలు రావడంతో చాలా మంది భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నష్టం లేదా ప్రాణనష్టం గురించి తక్షణ నివేదికలు లేవు. మళ్లీ ప్రకంపనలు సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు.
భూకంపం తీవ్రతను తెలిపేలా ఓ వీధిలోని సీసీటీవీ ఫుటేజీ వైరల్ అవుతూ ఉంది. భూకంపం, ఢిల్లీ అనే హ్యాష్‌ట్యాగ్‌లతో సోషల్ మీడియాలో వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియో ఫిబ్రవరి 17, 2025 ఉదయం 5.36 గంటలకు ఢిల్లీలో సంభవించిన ప్రకంపనల విజువల్స్‌ను చూపుతుందనే వాదనతో విజువల్స్ ను పోస్టు చేశారు.

“Just Look at the Blast and Wave it was something else still thinking about it. My Home CCTV video #earthquake #Delhi” అంటూ వీడియోను వైరల్ చేస్తున్నారు.





వైరల్ వీడియోకు సంబంధించిన ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు .

ఫ్యాక్ట్ చెక్:

వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. ఈ వీడియో భారతదేశంలోని ఢిల్లీకి సంబంధించింది కాదు. పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో చిత్రీకరించారు.

వైరల్ విజువల్స్ ను జాగ్రత్తగా గమనించగా CCTV ఫుటేజీలో తేదీ, సమయం ఫిబ్రవరి 15, 2025, 22:48 నిమిషాలుగా చూడవచ్చు. వైరల్ వీడియో స్క్రీన్ షాట్ ఇక్కడ ఉంది.

వీడియో నుండి కీఫ్రేమ్‌లను తీసుకుని సెర్చ్ చేయగా, ఫిబ్రవరి 15, 2025న అర్ధరాత్రి 12.33 గంటలకు భూకంపం, ఇస్లామాబాద్ అనే హ్యాష్‌ట్యాగ్‌లతో వీడియోని మరో X వినియోగదారు షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము.
ఇస్లామాబాద్‌లో భూకంప ప్రకంపనలు అంటూ పలువురు సోషల్ మీడియా వినియోగదారులు అదే వీడియోను షేర్ చేశారు.

కొంతమంది మల్టీమీడియా జర్నలిస్టులు ​​వైరల్ వీడియో ఇస్లామాబాద్, పాకిస్తాన్ లో రికార్డు అయిందని, ఢిల్లీ లో తీసింది కాదని పేర్కొన్నారు.
ఈ వీడియో ఢిల్లీ భూకంపానికి సంబంధించినది కాదు, ఇస్లామాబాద్ లో తీసింది.  ఫిబ్రవరి 15, 2025న 22:48కి, ఇస్లామాబాద్, రావల్పిండి ప్రాంతాలలో 4.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. CCTVలో ఉన్న తేదీ ఫిబ్రవరి 15న అని ఉంది. ఫిబ్రవరి 17న ఢిల్లీలో భూకంపం సంభవించింది

Businessstandard.com ప్రకారం, బుధవారం నాడు 5.7 తీవ్రతతో వచ్చిన భూకంపం పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌తో సహా పలు ప్రాంతాలను కుదిపేసిందని ఆ దేశ వాతావరణ విభాగం తెలిపింది. పంజాబ్ ప్రావిన్స్‌లోని నైరుతి భాగంలో డేరా ఘాజీ ఖాన్ ప్రాంతానికి సమీపంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని పాకిస్థాన్ వాతావరణ శాఖ (పీఎండీ)ని ఉటంకిస్తూ జియో న్యూస్ నివేదించింది.
ఎలాంటి ప్రాణనష్టం లేదా నష్టం జరిగినట్లు తక్షణ నివేదికలు లేవు. భూకంపం పాకిస్థాన్ స్టాండర్డ్ టైమ్ ప్రకారం మధ్యాహ్నం 12:28 గంటలకు చోటు చేసుకుంది. రిక్టర్ స్కేల్‌పై 5.7 తీవ్రతతో భూకంపం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాజధాని ఇస్లామాబాద్‌తో సహా ఖైబర్ పఖ్తుంఖ్వా, పంజాబ్ ప్రావిన్సుల్లోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు నమోదయ్యాయని నివేదికలు వచ్చాయి.
చెలామణిలో ఉన్న వైరల్ వీడియో ఢిల్లీలో సంభవించిన భూకంప ప్రకంపనలను చూపించలేదు, పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో భూకంపం విజువల్స్ కు సంబంధించింది. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది.
Claim :  ఫిబ్రవరి 17, 2025 తెల్లవారుజామున ఢిల్లీలో సంభవించిన భూకంపం ప్రకంపనలకు సంబంధించిన CCTV ఫుటేజీ
Claimed By :  Twitter users
Fact Check :  Unknown
Tags:    

Similar News