ఫ్యాక్ట్ చెక్: వైరల్ వీడియో లక్నోలో స్వాధీనం చేసుకున్న తుపాకులు, తూటాలను చూపించడం లేదు

లక్నోలో ముహర్రం పండుగకు ముందు, మలిహాబాద్ పోలీస్ స్టేషన్ నుండి కేవలం 100 మీటర్ల దూరంలో పోలీసులు అక్రమ ఆయుధాలను స్వాధీనం

Update: 2025-06-30 14:30 GMT

Guns and ammunition

లక్నోలో ముహర్రం పండుగకు ముందు, మలిహాబాద్ పోలీస్ స్టేషన్ నుండి కేవలం 100 మీటర్ల దూరంలో పోలీసులు అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. 72 ఏళ్ల వైద్య నిపుణుడు హకీమ్ సలావుద్దీన్ ఇంటి నుండి ఈ అక్రమ ఆయుధ కర్మాగారం నడుస్తూ ఉండడం ఆందోళన కలిగిస్తూ ఉంది. ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) పిస్టల్స్, రైఫిల్స్, మౌసర్లు సహా 12–13 అధునాతన తుపాకీలను, 3,000 కు పైగా తూటాలను స్వాధీనం చేసుకుంది. కొన్ని సోషల్ మీడియా పోస్టుల్లో 3000 తుపాకులు, 50,000 తూటాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లక్నోలోని మలిహాబాద్ ప్రాంతానికి చెందిన హకీమ్ సలావుద్దీన్ దుబాయ్ నంబర్‌తో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతున్నాడు, కొన్నిసార్లు రోజుకు ఒకటి లేదా రెండుసార్లు కాల్ చేస్తున్నాడు. లక్నోలోని హకీమ్ సలావుద్దీన్ ఇంటి నుండి స్వాధీనం చేసుకున్న తుపాకులు, మందుగుండు సామగ్రిని చూపిస్తున్నట్లు కొన్ని దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

వైరల్ వీడియో:

ఒక వీడియో “3,000 guns, 50,000 cartridges and cash recovered from Hakim Salauddin's house in Lucknow one day before Muharram. They are preparing for war. भीम आर्मी “ #Hindus #Rajasingh “PM Modi “ Yogi” “Islam” అనే క్యాప్షన్ తో షేర్ చేస్తున్నారు. 000 తుపాకులు, 50,000 తూటాలు స్వాధీనం చేసుకున్నట్లు ఈ పోస్టుల్లో తెలిపారు.



వైరల్ ఫోటో:

"లక్నోలోని హకీమ్ సలావుద్దీన్ ఇంటి నుండి 3000 తుపాకులు, 50,000 తూటాలు కలిగిన 20 బస్తాలు స్వాధీనం చేసుకున్నారు" అనే శీర్షికతో తుపాకులను చూపిస్తున్న మరో చిత్రం వైరల్ అవుతోంది.


వైరల్ పోస్టు ఆర్కైవ్ లింక్ లను ఇక్కడ చూడొచ్చు

ఫ్యాక్ట్ చెక్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

వైరల్ వీడియో:

వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను తీసుకుని, గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఉపయోగించి వాటిని శోధించినప్పుడు, ఆ వీడియో పాతదని, 2021 సంవత్సరం నుండి విజువల్స్‌ ఆన్ లైన్ లో ఉన్నాయని మాకు లభించింది. అదే వీడియోను “ Afghanistan collapse. American equipment, American cars, American weapons - this is the new Taliban. #Afghanistan #USA #Kabul” క్యాప్షన్‌తో చూపించే
X పోస్ట్‌
ను మేము కనుగొన్నాము. ఆఫ్ఘనిస్తాన్ కు సంబంధించిన విజువల్స్ అని తెలుస్తోంది.
“American equipment, American cars, American weapons - this is the new Taliban” అనే టైటిల్ తో ఆగస్టు 24, 2021న ప్రచురించిన YouTube వీడియోను కూడా మేము కనుగొన్నాము.
Full View

వైరల్ ఫోటో:
అల్మారాల్లో తుపాకులను పేర్చినట్లు చూపించే వైరల్ చిత్రాన్ని మేము శోధించినప్పుడు, 2021, 2020 సంవత్సరాల నుండి కొన్ని సోషల్ మీడియా పోస్ట్‌లు కనిపించాయి.

Full View
2017 సంవత్సరంలో షేర్ చేసిన wisgoon.com అనే వెబ్‌సైట్‌లో కూడా మేము ఒక పోస్ట్‌ను కనుగొన్నాము.
‘అయోవా కొత్త క్రైమ్ ల్యాబ్‌ను ప్రారంభించింది’ అనే శీర్షికతో
gctimes
అనే సైట్‌లో షేర్ చేసిన ఇలాంటి చిత్రాన్ని కూడా మేము కనుగొన్నాము. అయోవాలోని అంకెనీలోని బాలిస్టిక్స్ ల్యాబ్‌లో 3300 కంటే ఎక్కువ తుపాకులను పరిశీలిస్తుందని కథనం పేర్కొంది.
లక్నో పోలీసులు స్వాధీనం చేసుకున్న తుపాకులు, మందుగుండు సామగ్రి చిత్రాల కోసం మరింత శోధించినప్పుడు, కొన్ని వార్తా సంస్థలు పంచుకున్న అనేక చిత్రాలు మాకు కనిపించాయి. కనుక, వైరల్ దృశ్యాలు లక్నోలోని హకీమ్ సలావుద్దీన్ ఇంటి నుండి స్వాధీనం చేసుకున్న తుపాకులు, మందుగుండు సామగ్రికి సంబంధించినవి కావు. అవి వేర్వేరు సందర్భాలలోని పాత విజువల్స్. లక్నోలో స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, మందుగుండు సామగ్రికి సంబంధించిన విజువల్స్ అనే వాదన నిజం కాదు.
Claim :  లక్నోలోని హకీమ్ సలావుద్దీన్ ఇంటి నుండి స్వాధీనం చేసుకున్న తుపాకులు, తూటాలను చూపించే వీడియో
Claimed By :  Twitter users
Fact Check :  Unknown
Tags:    

Similar News