ఫ్యాక్ట్ చెక్: వైరల్ వీడియో అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడానికి ముందు తీసిన వీడియో కాదు, పాతది

అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా బోయింగ్ 787

Update: 2025-06-12 10:54 GMT

 plane crash

అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం కూలిపోయింది. ఆ విమానం లండన్‌కు బయలుదేరి నగరంలోని మేఘాని ప్రాంతంలోని భవనాలను ఢీకొట్టింది, దీనితో భారీగా నల్లటి పొగ కమ్ముకుంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్‌లోని బిజె మెడికల్ కాలేజీ విద్యార్థుల హాస్టల్‌పై కూలిపోయింది. విమానంలో చాలామంది ప్రయాణికులు ఉన్నారని పేర్కొంటున్నారు. ప్రమాదం తరువాత ఆకాశంలో దట్టమైన పొగ వ్యాపించింది. టేకాఫ్‌ కాగానే విమానం కుప్పకూలింది. సంఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు.. మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇదిలా ఉండగా, విమాన ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు ఒక ప్రయాణీకుడు తన విమాన ప్రయాణాన్ని రికార్డ్ చేస్తున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయే ముందు ఫేస్‌బుక్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడిన చివరి క్షణాలకు సంబంధించిన వీడియో అంటూ Xలో పోస్టులు పెట్టారు. “Facebook live video before Ahmedabad, Gujarat plane crash #planecrash” అనే క్యాప్షన్ తో వీడియోను షేర్ చేస్తున్నారు.



వైరల్ పోస్టు ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.

ఫ్యాక్ట్ చెక్:

వైరల్ అవుతున్న వాదన తప్పుదారి పట్టిస్తోంది. ఆ వీడియో అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదానికి సంబంధించినది కాదు.
వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించి, గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ చేసి వెతికినప్పుడు, జనవరి 2023లో నేపాల్‌లో జరిగిన విమాన ప్రమాదానికి సంబంధించిన వైరల్ వీడియోను షేర్ చేస్తున్న కొన్ని మీడియా నివేదికలను కనుగొన్నాము. “Nepal plane crash: Final moments of Yeti Airlines flight 691, filmed by a passenger on board” అనే టైటిల్ తో జనవరి 17, 2023న ఛానల్ న్యూస్ ఆసియా ప్రచురించిన YouTube వీడియోను మేము కనుగొన్నాము,
Full View
అల్ జజీరా నివేదిక ప్రకారం, సోను జైస్వాల్ అనే ప్రయాణీకుడు విమానం కూలిపోవడానికి ముందు అనుకోకుండా తన విమాన అనుభవాన్ని ఫేస్‌బుక్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశాడు. 90 సెకన్ల వీడియో విమానం హిమాలయాల దిగువ ప్రాంతంలోని పోఖారా మీదుగా భవనాలు, పచ్చని పొలాల మీదుగా ఎగురుతూ రన్‌వే వద్దకు చేరుకోవడంతో ప్రారంభమైంది. జైస్వాల్ వీడియో రికార్డు చేస్తూ ఉండగా, విమానం కిటికీ నుండి కనిపించే సుందరమైన దృశ్యాల, నవ్వుతున్న తోటి ప్రయాణీకులతో అంతా సాధారణంగా కనిపించింది. చివరగా, పసుపు రంగు స్వెటర్ ధరించిన జైస్వాల్ కెమెరాను తన వైపుకు తిప్పుకుని నవ్వాడు. అప్పుడు విమానం అకస్మాత్తుగా కూలిపోయింది, ప్రయాణీకుల ఏడుపులను వినవచ్చు. వీడియో చివరిలో, భారీ మంటలు, పొగ ఫ్రేమ్‌లో కనిపించాయి.
బిబిసి నివేదిక ప్రకారం, ఇద్దరు శిశువులు సహా 72 మంది ఈ విమాన ప్రమాదంలో మరణించారు. నేపాల్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. జనవరి 15న ఈ ప్రమాదం జరిగింది. విమానం ఖాట్మండు- పోఖారా మధ్య ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది.
వైరల్ వీడియో జూన్ 12, 2025న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనను చూపించడం లేదు. ఇది జనవరి 2023లో నేపాల్‌లో జరిగిన యేతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమాన ప్రమాద ఘటనకు సంబంధించింది. వైరల్ అవుతున్న వాదన తప్పుదారి పట్టిస్తోందిఈ వీడియో కీ, అహ్మదాబాద్ లో జరిగిన విమానం ఘోర ప్రమాదానికీ సంబంధం లేదు
Claim :  గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడానికి ముందు ఫేస్‌బుక్ లైవ్ స్ట్రీమ్ వీడియోను వైరల్ వీడియో చూపిస్తుంది
Claimed By :  X (Twitter) users
Fact Check :  Unknown
Tags:    

Similar News