ఫ్యాక్ట్ చెక్: పవన్ కళ్యాణ్ సేనతో సేనాని మీటింగ్ వేదికపై పట్టుకుంది టివికే పార్టీ జెండా కాదు
జనసేన అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో ‘సేనతో సేనాని’ అనే మూడు రోజుల కీలక కార్యక్రమం
Karnataka flag
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో ‘సేనతో సేనాని’ అనే మూడు రోజుల కీలక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆగస్టు 28 నుంచి 30, 2025 వరకు జరిగింది. పార్టీ భవిష్యత్తు రోడ్ మ్యాప్, సంస్థాగత బలోపేతంపై ప్రధాన దృష్టి పెట్టారు. ఆగస్టు 30న పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలోని ఇంద్రప్రియదర్శిని స్టేడియంలో జనసేన కార్యకర్తలు, అనుచరులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఇదిలా ఉండగా, సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఎరుపు, పసుపు రంగుల జెండాను పట్టుకుని ఉన్న ఒక వీడియో వైరల్ అవుతోంది. అది షేర్ చేస్తూ కొందరు, ఆయన టివికే (తమిళగ వెట్రి కలగం) పార్టీ జెండా పట్టూకున్నారని ప్రచారం చేశారు. తమిళ నటుడు విజయ్ స్థాపించిన టివికే పార్టీ జెండా ఇదేనని అన్నారు. పవన్ కళ్యాణ్ ఇతర పార్టీల జెండాలు మోసేందుకే పార్టీ పెట్టుకున్నట్లున్నాడని వ్యాఖ్యానిస్తూ షేర్ చేసారు. కొందరు సోషల్ మీడియా యూజర్లు "లికె “తమిళ హీరో విజయ్ టీవీకే పార్టీ జెండాతో ఆ పార్టీ కండువా మెడలో వేసుకున్న ప్యాకేజీ స్టార్.......ఇదేం పార్టీ ఇతనేం నాయకుడురా బాబు పక్క పార్టీల జెండాలు మోయడానికి పార్టీ పెట్టినట్టున్నాడు” అంటూ షేర్ చేసారు.
క్లెయిమ్‌కు సంబంధించిన ఆర్కైవ్ లింక్ ఇక్కడ చూడొచ్చు.
ఫాక్ట్ చెక్:
ఈ వాదన లో నిజం లేదు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఊపిన జెండా టివికే పార్టీ జెండా కాదు. అది కర్ణాటక కు చెందిన అనధికారిక జెండా (కన్నడ జెండా). వైరల్ వీడియోలో కనిపించిన జెండాతో పోలిక కోసం మేము కొన్ని చిత్రాలను పరిశీలించాము. X (ట్విట్టర్)లో పలు పోస్టులు అది కర్ణాటక/కన్నడ జెండా అనటుల పోఅస్తులు పంచుకున్నాయి.
అదేవిధంగా, ఒక X పోస్ట్‌లో పవన్ కళ్యాణ్ పట్టుకున్న జెండా గురించి స్పష్టతనూ ఇచ్చారు.
అలాగే, గుల్టే పోస్ట్ X ఖాతా లో పవన్ కళ్యాణ్ సేనతో సేనాని కార్యక్రమంలో జనసేన జెండాతో పాటు కర్ణాటక జెండా కూడా పట్టుకున్నారంటూ పోస్ట్ చేసింది. అదే సమావేశంలో, జనసేనా పార్టీ జాతీయ పార్టీ అవుతుందని కూడా అన్నారు అంటూ ఆ పిచ్ తెలిపింది.
ఆగస్టు 30, 2025న జనసేన పార్టీ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో లైవ్‌స్ట్రీమ్ చేసిన సేనతో సేనాని కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ ఎరుపు-పసుపు జెండాను పట్టుకుని ఉన్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. అందులో నుంచి స్క్రీన్ షాట్ ను తీసి, కర్ణాటక జెండా తో పోల్చి చూసాము. ఈ పోలిక ఇక్కడ చూడొచ్చు.
కర్ణాటక జెండా గురించి పలు వార్తా కథనాలు కూడా ఇదే రంగులతో ఉన్న జెండాను పంచుకున్నాయి. కనుక, వైరల్ వీడియోలో పవన్ కళ్యాణ్ ఊపినది టివికే పార్టీ జెండా కాదు. అది కర్ణాటక/కన్నడ అనధికారిక జెండా. వాదన నిజం కాదు.
Claim : పవన్ కళ్యాణ్ సేనతో సేనాని మీటింగ్ వేదికపై TVK (తమిళగ వెట్రి కలగం) పార్టీ జెండాను పట్టుకున్నారు
Claimed By : Social media users
Fact Check : Unknown