ఫ్యాక్ట్ చెక్: జపాన్ మాగ్‌లెవ్ ట్రైన్ ఖర్చు వారణాసి రోప్‌వే కంటే తక్కువా? కాదు

వారణాసిలో రోప్‌వే ప్రాజెక్ట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. కేంద్రం పట్టణ రవాణా మిషన్ కింద, రోడ్డు

Update: 2025-09-08 14:18 GMT

Maglev vs Varanasi

వారణాసిలో రోప్‌వే ప్రాజెక్ట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. కేంద్రం పట్టణ రవాణా మిషన్ కింద, రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ సాయంతో అభివృద్ధి చేస్తున్నారు. ఈ మొత్తం ప్రాజెక్ట్ దాదాపు 3.8 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది, వారణాసి కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ వంటి ముఖ్యమైన నగర ప్రాంతాలను గొడోవ్లియా చౌక్‌తో కలుపుతుంది. మొత్తం ఖర్చు దాదాపు 807 కోట్లుగా అంచనా వేశారు. సురక్షితమైన, సమర్థవంతమైన ప్రయాణానికి అధునాతన కేబుల్ కార్ వ్యవస్థలు రూపొందించారు. రోప్‌వే ప్రాజెక్ట్‌లోని ప్రధాన స్టేషన్లలో ప్రథమ చికిత్స సౌకర్యాలు, అంబులెన్స్ సేవలను కూడా ఏర్పాటు చేశారు. మరెన్నో సదుపాయాలు ఇందులో ఉన్నాయి.

ఇంతలో, వారణాసి రోప్‌వే, జపాన్ మాగ్లెవ్ రైలును పోల్చిన చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌లు జపాన్ మాగ్లెవ్ ప్రాజెక్ట్ వారణాసిలోని రోప్‌వే ప్రాజెక్ట్ కంటే తక్కువ ఖర్చు అవుతుందని పేర్కొన్నాయి. చిత్రంలో 310 mph వేగంతో నడిచే జపాన్ మాగ్లెవ్ రైలు రూ.616 కోట్లు ($70 మిలియన్లు), వారణాసిలో నిర్మించిన 3.75kn రోప్‌వే ఖర్చు రూ.800 కోట్లు అని పేర్కొంది.
Full View

ఫ్యాక్ట్ చెక్:

వైరల్ అవుతున్న వాదన నిజం కాదు. జపాన్ మాగ్లెవ్ రైలు ధర 64 బిలియన్ డాలర్లకు పైగా ఉంటుందని అంచనా, ఇది వారణాసి రోప్‌వే కంటే ఖరీదైనది. జపాన్ మాగ్లెవ్ రైలు గురించి తెలుసుకోడానికి మేము ప్రయత్నించగా, ఈ ప్రాజెక్టుకు $64 బిలియన్లు ఖర్చయిందని పేర్కొన్న కొన్ని వీడియోలు, వెబ్‌సైట్‌ కథనాలు మాకు కనిపించాయి.
Full View
జపాన్‌కు చెందిన మాగ్లెవ్, ఒక సూపర్ కండక్టింగ్ మాగ్నెటిక్ లెవిటేషన్ (SCMaglev) రైలు, భవిష్యత్తులో టోక్యో- ఒసాకాలను కలిపే చు షింకన్‌సెన్ లైన్ కోసం అభివృద్ధి చేస్తున్నారు. ఈ రైలు ట్రాక్‌ల పైన తేలడానికి శక్తివంతమైన అయస్కాంతాలను ఉపయోగిస్తారు, అత్యంత అధిక వేగంతో ప్రయాణించడానికి వీలు కల్పిస్తుంది.
జపాన్ మాగ్లెవ్ రైలు నిర్మాణం చువో షింకన్సెన్ లైన్ కోసం, మొదటి దశ (టోక్యో నుండి నగోయా) విస్తృతమైన భూగర్భ సొరంగం, పర్యావరణ సమస్యలు, అధిక ఖర్చులు వంటి సవాళ్ల కారణంగా 2034 వరకు ఆలస్యం అయింది. ఈ సాంకేతికత లెవిటేషన్, హై-స్పీడ్ ప్రయాణం కోసం సూపర్ కండక్టింగ్ మాగ్నెట్లను ఉపయోగిస్తారు, అందుకు ప్రత్యేకంగా నిర్మించిన ట్రాక్‌లు అవసరం. పర్యావరణ ప్రభావాలకు స్థానిక అడ్డంకులు, భౌగోళిక సవాళ్లు వంటివి ఈ ప్రాజెక్ట్ కు ఎదురుగా ఉన్నాయి. అందుకే ఒసాకా దాకా ట్రాక్ పొడిగింపుకు 2037 దాకా పట్టొచ్చని చెబుతున్నారు.
PIB ఫ్యాక్ట్ చెక్ కూడా వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పింది. 310 mph వేగంతో నడిచే జపాన్ మాగ్లెవ్ రైలు ధర ₹616 కోట్లు అని ఒక సోషల్ మీడియా పోస్ట్ పేర్కొంది, అయితే వారణాసిలో నిర్మించిన 3.75 కి.మీ రోప్‌వే ధర ₹800 కోట్లని వివరించింది. జపాన్ సింగిల్ సెట్ మాగ్లెవ్ రైలు ధరను వారణాసి రోప్‌వే ప్రాజెక్ట్ మొత్తం ఖర్చుతో తప్పుగా పోల్చారని తెలిపింది. మొత్తం మాగ్లెవ్ రైలు ప్రాజెక్ట్ ఖర్చు చాలా ఎక్కువ. తప్పుదారి పట్టించే కంటెంట్‌ను వ్యాప్తి చేసే ఇటువంటి సోషల్ మీడియా పోస్ట్‌ల పట్ల జాగ్రత్త వహించాలని PIB ఫ్యాక్ట్ చెక్ టీమ్ తెలిపింది.
కాబట్టి, వారణాసిలో నిర్మిస్తున్న రోప్‌వే, జపాన్ మాగ్లెవ్ రైలు కంటే ఖరీదైనదనే వాదన నిజం కాదు. మాగ్లెవ్ రైలు ఖర్చు 64 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ, రోప్‌వే ప్రాజెక్టుకు దాదాపు రూ. 800 కోట్లు అయింది.
Claim :  వారణాసిలో రోప్‌వే నిర్మాణానికి అయ్యే ఖర్చు కంటే తక్కువ ఖర్చుతో జపాన్ మెగ్లెవ్ రైలుని నిర్మించారు, ఇది మనదేశంలో అవినీతికి ఉదాహరణ
Claimed By :  Social media users
Fact Check :  Unknown
Tags:    

Similar News