ఫ్యాక్ట్ చెక్: కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ టాయిలెట్ల వినియోగంపై GST విధించలేదు

కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ టాయిలెట్ల వినియోగంపై GST విధించిందా..?

Update: 2022-07-27 15:25 GMT

క్లెయిమ్: కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ టాయిలెట్ల వినియోగంపై GST విధించిందా..?

ఫ్యాక్ట్ : వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు

పబ్లిక్ టాయిలెట్లపై ప్రభుత్వం వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) విధించిందని ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ వైరల్ గా మారింది. వైరల్ పోస్ట్ పంజాబ్ ప్రభుత్వ బస్టాండ్‌లోని పబ్లిక్ టాయిలెట్‌ ఉపయోగించినందుకు GST విధిస్తున్నారని అందులో ఉంది. టాయిలెట్ ను వాడుకున్నందుకు 5 రూపాయలు కాకుండా.. అదనంగా ఒక రూపాయిని జీఎస్టీ కింద చూపుతున్నట్లు రసీదులో ఉందని చెబుతూ ఉన్నారు. ఈ రసీదుకు సంబంధించిన ఫోటోను వైరల్ చేస్తూ ఉన్నారు
Full View

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న ఫోటో లోని రసీదు పాతదని మా బృందం గుర్తించింది. GST విధానం అమల్లోకి వచ్చిన ఒక నెల తర్వాత ఆగష్టు 2017లో ఇది చోటు చేసుకుంది. ఆ తర్వాత పబ్లిక్ టాయ్ లెట్ వినియోగంపై పన్ను ను పంజాబ్ అధికారులు తొలగించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ GST డేటాబేస్ ను కూడా మా బృందం పరిశీలించింది. వాష్‌రూమ్‌లు, టాయిలెట్‌ల వంటి ప్రజల సౌకర్యార్థం సేవలపై ఎటువంటి GST విధించబడలేదని కనుగొంది.

ప్రీ-ప్యాకేజ్ చేయబడిన, ముందే లేబుల్ చేయబడిన ఆహార పదార్థాలు, హాస్పిటల్ బెడ్‌లు వంటి కొన్ని కీలకమైన వస్తువులు, సేవలపై GST రేట్లు ఇటీవల పెరిగిన సందర్భంతో ఈ పాత పోస్ట్ ను మళ్లీ వైరల్ చేశారు.
GST రేట్లపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ డేటాబేస్ ద్వారా పరిశీలించారు. టాయిలెట్‌లు, వాష్‌రూమ్‌లు, మరుగుదొడ్లు, యూరినల్స్‌పై GST కింద ట్యాక్స్ నిల్ ఉందని కనుగొన్నారు. వీటిని సమిష్టిగా "ప్రజా సౌకర్యాల ద్వారా సేవలు" అని పిలుస్తారు.

ఈ వైరల్ పోస్టు అబద్ధమని 2017లోనే తెలిపారు.

ఈ పోస్ట్ అవాస్తవమని లూథియానా అధికారులు 2017లో ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కి చెప్పారు. మూత్ర విసర్జనను ఉచితంగా ఉపయోగిస్తున్నారని.. జీఎస్‌టీ విధించబడకుండా, టాయిలెట్‌ని ఉపయోగించడం కోసం 2 రూపాయలు మాత్రమే వసూలు చేశారని వెల్లడించారు.

లూథియానా బస్టాండ్ జనరల్ మేనేజర్ గుర్సేవక్ సింగ్ రాజ్‌పాల్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ "తాము అలాంటి రసీదును జారీ చేయలేదు. మరుగుదొడ్ల వినియోగంపై GST లేదు" అని ఆయన చెప్పుకొచ్చారు.
కాబట్టి, వైరల్ అవుతున్న పోస్ట్ అసత్యం.
Claim :  Viral Post Claims GST Imposed On Use Of Public Toilets
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News