ఫ్యాక్ట్ చెక్: భారీగా క్యూ లైన్ లో జనం నిలబడి ఉన్న వీడియో కుంభమేళాకు సంబంధించినది కాదు

జనవరి 29, 2025న మహాకుంభమేళాలో లక్షలాది మంది భక్తులు ప్రయాగ్ రాజ్ లోని జలాల్లో స్నానాలు చేసేందుకు తరలిరావడంతో జరిగిన

Update: 2025-02-05 05:17 GMT

Bansara Vrindavan

జనవరి 29, 2025న మహాకుంభమేళాలో లక్షలాది మంది భక్తులు ప్రయాగ్ రాజ్ లోని జలాల్లో స్నానాలు చేసేందుకు తరలిరావడంతో జరిగిన తొక్కిసలాటలో కనీసం 30 మంది మరణించారు. డజన్ల కొద్దీ గాయపడ్డారు. ప్రస్తుతం జరుగుతున్న మహా కుంభ్‌లో జనవరి 29న తొక్కిసలాట జరగడం దురదృష్టకరమని పేర్కొంటూ, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ నమోదైన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం పై సుప్రీం కోర్టు స్పందించింది. ఈ విషయమై అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాల్సిందిగా సుప్రీంకోర్టు సూచించింది.

“ఇది దురదృష్టకర సంఘటన, ఆందోళన కలిగించే విషయం. అయితే ఈ విషయాన్ని హైకోర్టుకు వెళ్లండి. ఇప్పటికే జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేశారు” అని సుప్రీం కోర్టు బెంచ్‌ తెలిపింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఈ ఘటనపై విచారణకు జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేశారని, హైకోర్టులో కూడా ఇదే విధమైన పిటిషన్ దాఖలయ్యిందని తెలిపారు.
పరాయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో అసలు మృతుల సంఖ్యను బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం దాస్తోందని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. తొక్కిసలాటలో 30 మంది మరణించారని, 60 మంది గాయపడ్డారని ప్రభుత్వం నివేదించింది, అయితే అసలు మృతుల సంఖ్య ఎక్కువగా ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. "ప్రభుత్వం బడ్జెట్ గణాంకాలను ఇచ్చిందని, దయచేసి మహాకుంభమేళాలో మరణించిన వారి గణాంకాలను కూడా ఇవ్వండి. మహాకుంభ్ ఏర్పాట్లపై స్పష్టత ఇవ్వడానికి అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నేను డిమాండ్ చేస్తున్నాను." అని అఖిలేష్ యాదవ్ అన్నారు.
ఇది ఇలా ఉండగా, భారీగా ప్రజలు చిన్న వీధిలో ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఇరుక్కుపోయి ఆ వీధిలో కనిపించారు. ఈ వీడియో మహా కుంభ మేళా లోని పరిస్థితిని చూపుతోంది అని వాదిస్తూ కొంత మంది సోషల్ మైడియ లో షేర్ చేసారు.


క్లెయిం కి సంబంధించిన ఆర్కైవ్ లింకును ఇక్కడ చూడొచ్చు.

ఫ్యాక్ట్ చెక్:

వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. పాత వీడియోను మహా కుంభమేళాకు లింక్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.
మేము వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను తీసుకుని, గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ చేశాం. అయితే ఆ వీడియో జనవరి 1, 2025 నుండి సర్క్యులేషన్‌లో ఉన్నట్లు మాకు తెలిసింది. నేషనల్ క్యాపిటల్ ఢిల్లీ అనే ఒక X హ్యాండిల్ లో అదే వీడియోను లొకేషన్‌ను 'బర్సానా బృందావన్‌' గా ట్యాగ్ చేస్తూ షేర్ చేశారు. వీడియోపై క్యాప్షన్ ‘Barsana, Vrindavan on 1st January 2025’ అని ఉంది.
తదుపరి శోధనలో, జనవరి 1, 2025న నూతన సంవత్సరం సందర్భంగా బృందావన్‌ దగ్గర ఉన్న బర్సానాలోని రాధా రాణి ఆలయానికి భారీగా తరలివచ్చిన జనాన్ని చూపించే మరికొన్ని వీడియోలను మాకు లభించాయి.
Full View
బర్సానా రాధ జన్మస్థలం. బృందావనం కృష్ణుడు తన బాల్యాన్ని గడిపిన ప్రదేశం. రాధా రాణి ఆలయం ఒక చారిత్రాత్మక దేవాలయం. ఏడాది పొడవునా అధిక సంఖ్యలో భక్తులు దర్శనాలకు ఈ ఆలయానికి వెళుతుంటారు. శ్రీ కృష్ణుడి జీవితంలో ఎంతో కీలకమైన ప్రాంతాలకు తీర్థయాత్ర చేయాలని అనుకున్నప్పుడు రాధా రాణి ఆలయాన్ని కూడా సందర్శిస్తారు. శ్రీకృష్ణుడి జీవితంలో ఎంతో ప్రాధాన్యమైన ప్రాంతాల్లో మధుర, బృందావనం, గోవర్ధన్, కురుక్షేత్ర, ద్వారక కూడా ఉన్నాయి. బర్సానాలో హోలీ పండుగకు ప్రసిద్ధి చెందింది. దీనిని లత్మార్ హోలీ అని పిలుస్తారు. ఈ పట్టణం బ్రజ్ ప్రాంతంలోని విష్ణు పర్వతం, బ్రహ్మ పర్వతం అనే రెండు కొండల మధ్య ఉంటుంది.
వైరల్ వీడియో మహాకుంభమేళాలో ప్రస్తుత పరిస్థితి అంటూ జరుగుతున్న ప్రచారం అబద్దపుది. ఈ వీడియో ప్రయాగ్‌రాజ్ కు సంబంధించింది కాదు. వీడియో 1 జనవరి 2025 నాడు బర్సానా లో తీసినది. అక్కడ ఉన్న రాధా రాణి ఆలయానికి తరలివచ్చిన భక్తులను చూపిస్తోంది. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది.
Claim :  వైరల్ వీడియోలో మహా కుంభమేళా సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లో భారీ రద్దీని చూపుతోంది
Claimed By :  Instagram Users
Fact Check :  Unknown
Tags:    

Similar News