ఫ్యాక్ట్ చెక్: తుఫాను కారణంగా విశాఖ బీచ్ లో ఒడ్డుకు కొట్టుకు వచ్చిన చేపలు అంటూ తప్పుడు వాదనలతో వీడియోను షేర్ చేస్తున్నారు

మిచోంగ్ తుఫాను ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, మచిలీపట్నం మధ్య బాపట్ల సమీపంలో తీరాన్ని తాకింది. తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరిలో చాలా భారీ వర్షాలు కురిశాయి.

Update: 2023-12-07 07:31 GMT

fish ashore Vizag beach

మిచోంగ్ తుఫాను ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, మచిలీపట్నం మధ్య బాపట్ల సమీపంలో తీరాన్ని తాకింది. తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరిలో చాలా భారీ వర్షాలు కురిశాయి. చెన్నైతో పాటు తమిళనాడులోని పలు ప్రాంతాల్లో తుపాను బీభత్సం సృష్టించింది. చెన్నైలోని ఎన్నో ప్రాంతాలు ఇంకా నీటిలోనే నిండి ఉన్నాయి. తుఫాను కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయారు.

తుఫాను ఆంధ్రప్రదేశ్‌లోని అనేక ప్రాంతాలలో ప్రభావం చూపించింది. మైచాంగ్ తుఫాను కారణంగా విశాఖపట్నంలో చేపలు ఒడ్డుకు వచ్చాయని పేర్కొంటూ తీరానికి సమీపంలో చేపలు ఉన్న వీడియో వైరల్ అవుతోంది.
“*తుఫాను కారణంగా విశాఖ బీచ్ లో ఒడ్డుకు కొట్టుకు వచ్చిన చేపలు.” అనే క్యాప్షన్ తో వీడియోను షేర్ చేశారు.


Full View

Full View
ఈ వాదనతో సోషల్ మీడియాలోని అన్ని ప్లాట్‌ఫారమ్‌లలో వీడియో వైరల్ అవుతుంది.

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది. వీడియో మే 2023 నాటిది.. ఇటీవలిది కాదు.

మేము వైరల్ వీడియో నుండి సంగ్రహించిన కీలక ఫ్రేమ్‌లను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. మే 2023 నుండి తెలుగు మీడియాకు సంబంధించిన అనేక యూట్యూబ్ ఛానెల్‌లలో వీడియో అందుబాటులో ఉన్నట్లు మేము కనుగొన్నాము.

సమయం తెలుగు యుట్యూబ్ ఛానల్ లో ఈ వీడియోను మే 29, 2023న పోస్టు చేశారు. “Thousands of fish wash ashore on Bheemili beach I Vishakapatnam” అనే టైటిల్ తో భీమిలి బీచ్ కు సంబంధించిన వీడియో అని తెలిపారు. నగరంలోని భీమిలి బీచ్‌లోని నివాసితులు, సందర్శకులు వేల సంఖ్యలో చేపలను చూసి ఆశ్చర్యపోయారని వీడియో వివరణ పేర్కొంది.
Full View

ఇదే వీడియోను NTV తెలుగు యూట్యూబ్ ఛానెల్‌లో కూడా పోస్టు చేశారు. భీమిలి బీచ్‌లో కొట్టుకుపోయిన చేపలు(Fishes Washed Ashore at Bheemili Beach | Ntv) అనే శీర్షికతో వీడియోను అప్లోడ్ చేశారు. చేపలు ఒడ్డుకు కొట్టుకువచ్చాయని, స్థానికులతో పాటు పర్యాటకులు కూడా ఈ బతికి ఉన్న చేపలను పట్టుకోవడానికి ప్రయత్నించారని యాంకర్ పేర్కొన్నట్లు వినవచ్చు.
Full View
ఇదే వీడియోను వీ6 న్యూస్ తెలుగు కూడా “వైజాగ్ బీచ్‌లో భారీగా ఒడ్డుకు కొట్టుకువచ్చిన చేపలు” అనే శీర్షికతో ప్రచురించారు.
Full View

Circare Express యూట్యూబ్ ఛానల్ లో కూడా మే 29, 2023న వీడియోను "విశాఖపట్నం బీచ్ లో ఒడ్డుకు చేపలు || Fish washed ashore at Visakhapatnam beach@CircarExpress" అనే టైటిల్ తో వీడియోను షేర్ చేశారు.
Full View
కాబట్టి, వైరల్ వీడియో ఇటీవలిది కాదని గుర్తించాం. మే 2023లో సముద్రతీరంలో చేపలు ఒడ్డుకు కొట్టుకువచ్చిన సంఘటనకు సంబంధించినది. ఈ ఘటన మిచోంగ్ తుఫాను వల్ల చోటు చేసుకోలేదు. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేదిలా ఉన్నాయి.
Claim :  The video shows fish washed ashore on the beach in Vizag due to the recent Cyclone Michaung
Claimed By :  Social media users
Fact Check :  Misleading
Tags:    

Similar News