ఫ్యాక్ట్ చెక్: కులాల వారీగా దేశాన్ని కాంగ్రెస్ విభజిస్తోందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఒప్పుకుంటున్న వీడియోను ఎడిట్ చేశారు

బీహార్‌లోని ఔరంగాబాద్‌లో మల్లికార్జున్ ఖర్గే ప్రసంగానికి సంబంధించిన వార్తా నివేదికలను కూడా మేము

Update: 2024-03-18 08:43 GMT

కులాల వారీగా దేశాన్ని విభజించడంలో తమ పార్టీ పాత్ర ఉందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అంగీకరించారని సోషల్ మీడియాలో ఓ వీడియో క్లిప్ వైరల్ అవుతూ ఉంది. ఆ క్లిప్‌లో ఖర్గే హిందీలో మాట్లాడుతూ “కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కులం పేరుతో దేశాన్ని విభజించింది” అని చెప్పడం వినవచ్చు. #WhyModi అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఖర్గే చేసిన వ్యాఖ్యలను షేర్ చేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న భారత్ జోడో న్యాయ్ యాత్రకు సంబంధించి ఈ వీడియో వైరల్ అవుతూ ఉంది. రాహుల్ గాంధీ నేతృత్వంలో భారత్ జోడో యాత్రకు సంబంధించిన రెండవ దశ మణిపూర్‌లో ప్రారంభించారు. మార్చి 20, 2024న ముంబయిలో ఈ యాత్ర ముగుస్తుంది.

ఫ్యాక్ట్ చెకింగ్:
కాంగ్రెస్ పార్టీ దేశాన్ని కులాల వారీగా విభజించిందని మల్లికార్జున్ ఖర్గే అంగీకరించారనే వాదనలు అవాస్తవమని మేము ధృవీకరించాము. నిడివి ఎక్కువ ఉన్న వీడియోలో మల్లికార్జున్ ఖర్గే ఈ విమర్శలను ప్రధాని మోదీకి ఆపాదించారు. ప్రధాని మోదీని, బీజేపీని విమర్శిస్తున్నారని స్పష్టంగా తెలుస్తూ ఉంది.

మేము వైరల్ వీడియో నుండి కీ ఫ్రేమ్‌లను ఉపయోగించి రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని నిర్వహించాము. 15 ఫిబ్రవరి 2021న వార్తా సంస్థ ANI ద్వారా భాగస్వామ్యం చేసిన X పోస్ట్‌ను గుర్తించాము. అందులో మల్లికార్జున్ ఖర్గే ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఔరంగాబాద్‌లో ఈ బహిరంగ సభ జరిగిందని క్యాప్షన్ మాకు సూచించింది.

Mallikarjun Kharge’s speech in Bihar అనే కీవర్డ్స్ ను ఉపయోగించి కూడా మేము గూగుల్ సెర్చ్ చేశాం. కాంగ్రెస్ అధికారిక యుట్యూబ్ ఛానల్ లో ఒరిజినల్ వీడియోను మేము చూశాం.
ఫిబ్రవరి 15, 2024న బీహార్‌లోని ఔరంగాబాద్‌లో 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మల్లికార్జున్ ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వీడియోను చూస్తే.. కుల గణనకు సంబంధించి కాంగ్రెస్ డిమాండ్‌ను ఉద్దేశించి ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారని స్పష్టమవుతూ ఉంది. దాదాపు 30:00 టైమ్‌స్టాంప్‌లో, కుల గణన వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఖర్గే మాట్లాడారు. కులాల గణన కోసం మా డిమాండ్‌లో తప్పేముంది? కొంతమంది కాంగ్రెస్ పార్టీ కులం పేరుతో దేశాన్ని విభజిస్తోందని అంటున్నారని విమర్శించారు.
రాహుల్ గాంధీ, మా పార్టీ ఒకే డిమాండ్‌ తో ఉంది. అది కుల గణన.. మా పార్టీ అధికారంలోకి వస్తే, మేము దానిని అమలు చేస్తాము. ఈ జనాభా గణన వివిధ కులాల ప్రజల స్థితిగతులపై విలువైన సమాచారాన్ని అందిస్తుంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి వెనుకబడిన వర్గాలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, మైనారిటీలు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వివిధ వర్గాల విద్యా, ఆర్థిక పురోగతిని అర్థం చేసుకోవడానికి కులగణన ఎంతగానో సహాయపడుతుంది. అందుకోసమే మేము కుల గణనను డిమాండ్ చేస్తున్నాం. భారత జాతీయ కాంగ్రెస్ అధికారిక వెబ్‌సైట్‌లో ఖర్గే చేసిన ప్రసంగం వివరణ కూడా ఇదే!!
ప్రధాని మోదీ విషయంలో ఖర్గే చేసిన ప్రకటనలను ఒరిజినల్ వీడియో నుండి ఉద్దేశపూర్వకంగా ఎడిట్ చేశారు. కుల గణన డిమాండ్‌పై మోదీ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించి.. ఆ వాదనలకు కౌంటర్ ఇచ్చారు ఖర్గే. అసలైన వీడియోను 13:13 నుండి 13:18 మధ్య చూడొచ్చు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి వీడియోను ఎడిట్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.

Full View

బీహార్‌లోని ఔరంగాబాద్‌లో మల్లికార్జున్ ఖర్గే ప్రసంగానికి సంబంధించిన వార్తా నివేదికలను కూడా మేము కనుగొన్నాము.
ఫిబ్రవరి 15, 2024న 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' సందర్భంగా తీసిన ఔరంగాబాద్ వీడియోను ఎడిట్ చేశారు. ఎడిట్ చేసిన క్లిప్ లో ఖర్గే సందేశాన్ని వక్రీకరించారు. కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు.


Claim :  At a public meeting, Mallikarjun Kharge said, \"As always, Congress divides the country. It divides the country in the name of caste.
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News