ఫ్యాక్ట్ చెక్: పిల్లలు పాఠశాలకు వెళ్లడానికి థర్మోకోల్ పెట్టెలను ఉపయోగిస్తున్నట్లు చూపే వీడియో మధ్యప్రదేశ్‌ది కాదు
భారతదేశంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు అనేక రాష్ట్రాలను ప్రభావితం చేశాయి. దీని వలన సాధారణ జనజీవనానికి తీవ్ర
By - Satya Priya BNUpdate: 2025-07-29 13:02 GMT
Children using Thermocol boxes
భారతదేశంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు అనేక రాష్ట్రాలను ప్రభావితం చేశాయి. దీని వలన సాధారణ జనజీవనానికి తీవ్ర అంతరాయం కలిగింది. పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, కేరళ వంటి ఇతర రాష్ట్రాలతో పాటు హిమాచల్ ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు కూడా ఇటీవల తీవ్రమైన వరదల బారిన పడ్డాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి పట్టణంలో క్లౌడ్ బరస్ట్ కారణంగా సంభవించిన వరదల్లో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు, 20 కి పైగా వాహనాలు జల సమాధి అయ్యాయి. ఇక అనేక ఇళ్ళు కూడా మునిగిపోయాయి. మధ్యప్రదేశ్‌లోని 34 జిల్లాలకు వాతావరణ శాఖ భారీ వర్ష హెచ్చరిక జారీ చేసింది. IMD ప్రకారం, 14 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది, 20 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ఈ రుతుపవన కాలంలో రాజస్థాన్‌లో ఇప్పటివరకు సాధారణం కంటే దాదాపు 88 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది.
వైరల్ పోస్టు ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదన నిజం కాదు. ఈ వీడియో మధ్యప్రదేశ్‌కు చెందినది కాదు. ఇది ఇండోనేషియాలోని దక్షిణ సుమత్రా కు సంబంధించిన పాత వీడియో.
వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను తీసుకుని, రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా సెప్టెంబర్ 2021లో ఇండోనేషియా భాషలో క్యాప్షన్‌తో షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను మేము కనుగొన్నాము. వీడియోలోని క్యాప్షన్ ద్వారా ఆ వీడియో ఇండోనేషియాలోని దక్షిణ సుమత్రా నుండి వచ్చిందని పేర్కొంది.
Kompas.com ప్రకారం, ఈ వీడియోలో ముగ్గురు పిల్లలు తెల్లటి, చతురస్రాకారపు స్టైరోఫోమ్ ఉపయోగించి రోయింగ్ చేస్తున్నట్లు చూపిస్తుంది. నది ఉన్న ప్రదేశం దక్షిణ సుమత్రాలోని ఓగన్ కొమెరింగ్ ఇలిర్ (OKI) రీజెన్సీలో ఉంది. వారు తులంగ్ సెలాపాన్ జిల్లాలోని SDN 1 కౌలాలో 12 మంది విద్యార్థులు, నదిని దాటాలనుకుంటున్నారు. స్టైరోఫోమ్ ఉపయోగించి రోయింగ్ చేయడం చాలా ప్రమాదకరమని, వీడియో చూసిన వాళ్లు ఆందోళన వ్యాలీటం చేశారు. గ్రామంలోని పిల్లలను వారి తల్లిదండ్రులు పడవ లేదా స్పీడ్ బోట్ ఉపయోగించి తీసుకెళ్తారు. అయితే, కొన్నిసార్లు పిల్లలు స్టైరోఫోమ్‌పై నదిని దాటడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.
"దక్షిణ సుమత్రాలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులు పాఠశాలకు వెళ్లడానికి స్టైరోఫోమ్‌ను ఉపయోగిస్తున్నారు" అనే శీర్షికతో Kompas.com సెప్టెంబర్ 25, 2021న ప్రచురించిన YouTube వీడియోను కూడా మేము కనుగొన్నాము. వీడియో వివరణలో 'సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోలో ప్రాథమిక పాఠశాల యూనిఫామ్‌లో ఉన్న ముగ్గురు అబ్బాయిలు నదిని దాటడానికి స్టైరోఫోమ్‌ను ఉపయోగిస్తున్నట్లు చూపిస్తుంది. దక్షిణ సుమత్రాలోని ఓగన్ కొమెరింగ్ ఇలిర్ (OKI) రీజెన్సీలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు.
కాబట్టి, వైరల్ వీడియో భారతదేశంలోని మధ్యప్రదేశ్ కు సంబంధించింది కాదు, ఇండోనేషియాలోని దక్షిణ సుమత్రా కు సంబంధించిన పాత వీడియో. వైరల్ అవుతున్న వాదన నిజం కాదు.
Claim : పిల్లలు పాఠశాలకు వెళ్లడానికి థర్మోకోల్ పెట్టెలను ఉపయోగిస్తున్నట్లు చూపించే వీడియో మధ్యప్రదేశ్‌కు చెందినది
Claimed By : Social media users
Fact Check : Unknown