ఫ్యాక్ట్ చెక్: రోడ్డు ప్రమాదం ఘటనకు సంబంధించిన గొడవను మతపరమైన కోణంలో షేర్ చేస్తున్నారు

పహల్గాం ఉగ్రదాడిలో నేవీ అధికారి వినయ్ నర్వాల్ మరణించారు. ఈ ఘటనపై ముస్లింలు, కశ్మీరీలను నిందించొద్దు అని ఆయన భార్య

Update: 2025-05-05 11:49 GMT

పహల్గాం ఉగ్రదాడిలో నేవీ అధికారి వినయ్ నర్వాల్ మరణించారు. ఈ ఘటనపై ముస్లింలు, కశ్మీరీలను నిందించొద్దు అని ఆయన భార్య హిమాన్షీ నర్వాల్ ఇటీవల కోరారు. ఆమె మీద కూడా ట్రోలింగ్ చేశారు. ఈ అంశంపై జాతీయ మహిళా కమిషన్ జోక్యం చేసుకుంది. ఆమె సైద్ధాంతిక వ్యక్తీకరణను తప్పుబడుతూ ట్రోల్ చేయడం సరికాదని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ మరణం తర్వాత ఆమె భార్య హిమాన్షీపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ దురదృష్టకరమని తెలిపింది. పహల్గామ్ ఘటన తర్వాత భారతదేశం, పాకిస్తాన్ మధ్య సంబంధాలు మరింత దిగజారాయి.

ఇంతలో, డెహ్రాడూన్‌లో వివాహానికి వెళుతున్న ముస్లిం కుటుంబంపై అతని పేరు అడిగి దాడి చేశారని రక్తంతో పూర్తిగా తడిసిన వ్యక్తి వీడియోను వైరల్ చేస్తున్నారు. హిందీలో పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. “డెహ్రాడూన్, ఉత్తరాఖండ్: బంజారావాలాలో వివాహ వేడుకకు వెళ్తున్న ముస్లిం కుటుంబంపై 5-6 మంది వ్యక్తులు ఇనుప రాడ్‌లు, కత్తులతో దాడి చేశారు. వారి పేరు మరియు మతాన్ని అడిగిన తర్వాత దుండగులు వారిపై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. #alleyesonindianmuslims” అని అందులో ఉంది.

వీడియో లింక్ లను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు. (హెచ్చరిక: వీడియో లో గ్రాఫికల్ కంటెంట్ ఉంది). క్లెయిం ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.

ఫ్యాక్ట్ చెక్: 

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వీడియో కారు కారణంగా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. 
ఈ సంఘటన గురించి మరింత సమాచారం కోసం శోధించినప్పుడు, డెహ్రాడూన్ పోలీసులు ప్రచురించిన పోస్ట్‌ మాకు లభించింది. ఈ సంఘటనలో ఎటువంటి మతపరమైన కోణం లేదని ఒక పోలీసు అధికారి చెప్పడం మనం వినవచ్చు. పోలీస్ అధికారుల ప్రకారం, 01/05/2025న, కొత్వాలి పటేల్ నగర్ ప్రాంతంలోని మోనాల్ ఎన్‌క్లేవ్ బంజారా వాలాలో జరిగిన గొడవ గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. భోగ్‌పూర్ నివాసి అయిన అనిష్ అలీ తన కుటుంబంతో కలిసి భారువాలా గ్రాంట్‌లో ఒక వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వెళ్తున్నాడు. మోనాల్ ఎన్‌క్లేవ్‌లోని ఒక దుకాణం వెలుపల అతని వాహనం చెడిపోయింది. ఇంతలో ట్రాఫిక్ జామ్ అయింది. మోనాల్ ఎన్‌క్లేవ్‌లో నివసిస్తున్న సంజయ్ రావత్ కు అనిష్ అలీ మధ్య వివాదం జరిగింది. ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది, ఈ ఘటనలో ఇరు వర్గాల వ్యక్తులూ గాయపడ్డారు. క్లెమెంటౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితిని నియంత్రించడానికి, శాంతిభద్రతలను కాపాడటానికి పోలీసు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు.
ఈ సంఘటనకు సంబంధించి, ఇరువర్గాలు కొత్వాలి పటేల్ నగర్‌లో పరస్పర ఫిర్యాదులు చేశారు. సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సంఘటనకు సంబంధించిన అన్ని కోణాలను పోలీసులు వివరంగా దర్యాప్తు చేస్తున్నారు, ఆధారాలు, వీడియో ఫుటేజ్ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు. కారు చెడిపోవడం, ట్రాఫిక్ జామ్ కారణంగా ఏర్పడిన వివాదం కారణంగా ఈ సంఘటన జరిగింది, కానీ సోషల్ మీడియాలో కొంతమంది ఈ సంఘటనను మతపరమైన కోణంలో ప్రచారం చేస్తున్నారని పోలీసులు తెలిపారు.
Full View
ఈటీవీ భారత్‌లో ప్రచురితమైన ఒక కథనం ప్రకారం, కొత్వాలి పటేల్ నగర్ లో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. మే 1న, కొత్వాలి పటేల్ నగర్ ప్రాంతంలోని బంజారావాలాలోని మోనాల్ ఎన్‌క్లేవ్‌ దగ్గర గొడవ జరిగినట్లు పోలీసులు సమాచారం అందింది. ఆ తర్వాత, కొత్వాలి పటేల్ నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విచారణలో, భోగ్‌పూర్ నివాసి అయిన అనిష్ అలీ తన కుటుంబంతో కలిసి భారువాలా గ్రాంట్‌లో ఒక వివాహ వేడుకకు హాజరు కావడానికి వెళ్తున్నట్లు తేలింది. మోనాల్ ఎన్‌క్లేవ్‌లోని ఒక దుకాణం వెలుపల అతని కారు చెడిపోయింది. దీని కారణంగా, అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ విషయంపై మోనాల్ ఎన్‌క్లేవ్‌లో నివసిస్తున్న సంజయ్ రావత్, అనిష్ అలీ మధ్య వివాదం మొదలైంది. ఆ తర్వాత ఈ వివాదం ఘర్షణగా మారింది. దీనిలో ఇరువైపుల ప్రజలు గాయపడ్డారు.
ఓ వ్యక్తి రక్తంతో ఉన్నట్లు చూపించే వైరల్ వీడియో, కారు నిలిచిపోవడంతో జరిగిన గొడవకు సంబంధించింది. అతని పేరు అడిగిన తర్వాత ముస్లిం అని తెలిసిన తర్వాత కొట్టారనే వాదనలో నిజం లేదు.
Claim :  ఉత్తరాఖండ్‌లో ఒక ముస్లిం కుటుంబాన్ని ఇతరులు పేరు అడిగి కొట్టారు
Claimed By :  X (Twitter) users
Fact Check :  Unknown
Tags:    

Similar News